కడప మహావీర్‌ సర్కిల్‌ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కడప నగరంలోని మహావీర్‌ సర్కిల్‌కు చేరుకున్నారు. వివిధ అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.305 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం వైయస్‌ రాజారెడ్డి, వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి, స్టేడియంలో అభివృద్ధి పనులను ప్రారంభించి, క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతారు. అక్కడే ఫొటో గ్యాలరీని పరిశీలిస్తారు.  క్రీడాకారులతో సీఎం మాట్లాడుతారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top