ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, మండలి రద్దుపై చర్చించినట్లుగా సమాచారం. సీఎం వైయస్ జగన్‌తో సమావేశం అద్భుతంగా జరిగింది సీఎం వైయస్ జగన్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్‌తో పలు అంశాలపై చర్చించామన్నారు.