వార్షిక బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం

అమరావతి: 2020–2021వ సంవత్సర వార్షిక బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు బుధవారం ముగిశాయి. రెండు రోజుల సమావేశాల్లో పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే ఎన్‌ఆర్‌సీకి సంబంధించి, ఆక్వా అథారిటీ బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. అంతకు ముందు సరిహద్దుల్లో వీర మరణం పొందిన జవాన్లకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలుపుతూ తీర్మానం చేసింది. 
 

Back to Top