ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ప్రారంభం

 విశాఖపట్నం: ప్రపంచ పర్యాటక దినోత్స‌వ వేడుక‌లు ఆదివారం విశాఖ న‌గ‌రంలో ఘ‌నంగా ప్రారంభించారు. ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ ఈ వేడుక‌ల‌ను ప్రారంభించారు. ప‌ర్యాట‌క‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన స్థానం దక్కేలా అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు నూతన పర్యాటక పాలసీని ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వసతులు, భద్రత తదితరాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యాటక రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. వాటర్‌ స్పోర్ట్స్‌ ఏర్పాటు చేసే సంస్థలకు పన్ను రాయితీ ఇస్తుంది. ట్రావెల్‌ ఏజెంట్లు, సంస్థలు, హోటళ్లు, తదితరాలన్నీ పర్యాటక శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నిర్దేశించింది.   

Back to Top