జగనన్నే మా భరోసా 

సత్యబాబు, చిలకలపాడు, ఆలమూరు మండలం 

 డా.బీ.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా: మేమంతా సిద్ధం బస్సుయాత్ర మడిక వద్దకు వచ్చిన సమయంలో రోడ్డు పక్కన నిలుచున్న ప్రజల మధ్యలో ఒక అంబులెన్స్‌ ఎదురైంది. సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు ఒక బాధితుని అంబులెన్స్‌లో అక్కడకు తీసుకు వచ్చి ఒక కుటుంబం ఎదురుచూస్తోంది. వారిని గమనించిన సీఎం వైయ‌స్‌ జగన్ బస్సు ఆపి అంబులెన్స్ వద్దకు వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. 
నలభై ఏళ్ల రాయుడు సత్యబాబుది అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మడిక దగ్గర చిలకలపాడు అనే చిన్న గ్రామం. నిత్యం వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. భుజంపై ఎరువుల బస్తా పెట్టుకుని పొలంగట్టుపై వెళుతుండగా వర్షంలో కాలు జారి పడటంతో, బరువైన ఆ మూట మెడపై పడి మెడ నరం తెగిపోయింది. దాంతో ఇంటికి ఆధారమూ తెగిపోయింది. వెనువెంటనే నెల్లూరు నారాయణా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ జరిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పూర్తి అచేతనావస్థలో ఉండిపోయాడు. కొన్నాళ్లపాటు ఫిజయోథెరపీ చేయించుకోవాల్సిందే అని డాక్టర్లు చెబుతున్నారు. నిత్యం 2వేల రూపాయిలు ఖర్చుపెట్టి ఫిజియోథెరపీ చేయించుకునే స్తోమత లేక నిస్సహాయంగా మంచంపై ఉండిపోయాడు సత్యబాబు. ఇద్దరు చిన్నపిల్లలు. కుటుంబాన్ని పోషించుకోడానికి సత్యబాబు భార్య రోజుకు రూ.180 లకు నర్సరీలో పనికి వెళుతోంది. సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిస్తే తమకు ఏదో ఒక ఆధారం దొరుకుతుందని, తన ఆరోగ్యం బాగుపడి కుటుంబం మళ్లీ గాడిన పడుతుందని సత్యబాబు గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే సీఎం వైఎస్‌ జగన్ మేమంతా సిద్ధం యాత్రలో తన గోడు చెప్పుకున్నాడు. వారి కుటుంబ పరిస్థితి, సత్యబాబు ఆరోగ్యం గురించి వివరంగా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ అధికారులతో మాట్లాడారు. సత్యబాబు కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. జగనన్న మాత్రమే తమను ఆదుకుంటాడన్న తమ నమ్మకమే నిజమైందంటున్నారు సత్యబాబు కుటుంబ సభ్యులు.

పూసల రామకృష్ణ, రైతు

పాపకు హార్ట్ లో హోల్ ఉందని కరెక్ట్ గా 5వ నెలలో తెలిసింది. ఆస్పత్రికి తీసుకెళ్తే 3 సంవత్సరాలు మందులు వాడదాం తగ్గకపోతే హార్ట్ కు సర్జరీ చేద్దాం అదే హోల్ కు స్టంట్ కు వేద్దామని అన్నారు. మన జగనన్న వల్ల ఆరోగ్యశ్రీ మీద అది చేయించాను. మేము ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రూ.8 వేలు అకౌంట్లో వేసేశారు. జగనన్న వల్ల రైతుభరోసా కూడా మొన్న సార్వాకు 4 రోజులకే పడిపోయాయి. జగనన్న గారు చేసే మంచు పనులు చాలా బాగున్నాయి. పంట అమ్ముకునే విషయంలో ఎటువంటి సమస్యలు లేవు. జగన్ గారు వచ్చాక రైతుకు చాలా బాగుంది మంచి బెనిఫిట్ ఇచ్చారు. రైతును చాలా బాగా చూస్తున్నారు జగన్ గారు. రైతుకు ఇంకా ఇంకా బాగా బెనిఫిట్ చేస్తాడు జగనన్న వచ్చాక.

కొరుపులి సత్తిబాబు, రైతు

మాకు జగన్ వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉంది. మేము ఏటా రెండు పంటలు వేస్తున్నాం. ఓ పదిరోజుల్లో ఇంచుమించుగా మాకు డబ్బులు పడిపోతున్నాయి. మొన్న సార్వా ధాన్యానికి అయితే వారానికే డబ్బులు పడిపోయాయి. ఇప్పుడు రెండో పంట పంపించాం. జగన్ బాగానే చేస్తున్నాడు. నేను కూడా 500 బస్తాల దాకా కమీషన్ దారుడికి పంపించేవాడిని, కానీ 500 బస్తాలకు ఒకేసారి ఇచ్చేవాడు కాదు పదిసార్లుగా ఇచ్చేవాడు. ఇప్పుడైతే డబ్బులు ఒకేసారి పడిపోతున్నాయి. ఈ బాకీలు తీర్చుకున్నా, ఏదన్నా చేసుకున్నా కూడా ఎంతోకొంతగా మాకు డబ్బులు కనపడుతున్నాయి.
 

Back to Top