మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్

అన‌కాప‌ల్లి జిల్లా: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారు చేప‌ట్టిన మేమంతా సిద్ధం 20వ రోజు ఆదివారం (ఏప్రిల్ 21) షెడ్యూల్‌ను వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి త‌ల‌శీల ర‌ఘురాం విడుద‌ల చేశారు. రేపు ఉదయం 9 గంటలకు చిన్నయపాలెం రాత్రి బస నుంచి  బయలుదేరుతారు. పినగాడి జంక్షన్, లక్ష్మిపురం మీదుగా వేపగుంట జంక్షన్ అనంతరం  భోజన విరామం తీసుకుంటారు.
గోపాలపట్నం, NAD జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా MVV సిటీ ఎండాడ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Back to Top