సీఎం వైయ‌స్ జగ‌న్‌కు ఉత్త‌రాంధ్ర సాంప్ర‌దాయ నృత్యాల‌తో ఘ‌న స్వాగ‌తం

జ‌న‌నేత రాక‌తో జ‌న‌సంద్ర‌మైన‌ విశాఖ న‌గ‌రం 

విశాఖపట్నం జిల్లా:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర జైత్ర‌యాత్ర‌లా సాగుతోంది. విశాఖ‌న‌గ‌రంలోని  ఎండాడ ఎం వీ వీ సిటీ నైట్ స్టే పాయింట్ నుంచి  ముఖ్యమంత్రి వైయస్.జగన్ 21వ రోజు బస్సుయాత్ర ప్రారంభ‌మైంది. మహా విశాఖ నగరపాలక సంస్ధ పరిధిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ రెండో రోజు రోడ్ షో నిర్వ‌హించారు. మధురవాడ డాక్టర్ వైయస్ఆర్ స్పోర్ట్స్  స్టేడియం, కార్ షెడ్ మీదుగా ముఖ్యమంత్రి రోడ్ షో కొన‌సాగింది. సీఎం వైయస్.జగన్ కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలైన తప్పెటగుళ్లు, కోలాటంతో ప్ర‌జ‌లు స్వాగతం పలికారు. 
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ బస్సు పైకి ఎక్కి ప్రజలు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.   

కొమ్మాది, మారిక వలస మీదుగా ఆనందపురం జంక్షన్ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్ర. ఆనందపురం జంక్షన్ వద్ద ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు.

Back to Top