19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం

కాకినాడ‌: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 19వ రోజు గోడిచ‌ర్ల‌ రాత్రి బస ప్రాంతం నుంచి ప్రారంభ‌మైంది. గోడిచ‌ర్ల‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. జ‌న‌నేత‌కు గ‌జ‌మాల‌తో, పూల‌వ‌ర్షంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. బస్సు ముందు నిలబడి గొడిచర్ల గ్రామస్థులు స్వాగతం పలికారు. 19వ రోజు బ‌స్సు యాత్ర నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటుంది. అచ్యుతాపురంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం వైయ‌స్‌ జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. స‌భ అనంత‌రం బయ్య­వరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ చేరుకుంటారు. 

Back to Top