పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననాయకుడికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. నుదిటిపై గాయం మానకపోయినా.. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం వైయస్ జగన్ తన బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.