ఎక్కడి సమస్యలు అక్కడే..

వైయస్‌ జగన్‌కు మహిళలు మొర..
విజయనగరంః ఆనందపురంలో మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ గ్రామంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌తో చెప్పుకుని వాపోయారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మండిపడ్డారు.గ్రామంలో వివక్షత తీవ్రంగా ఉందని, టీడీపీకి చెందినవారికే లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు.పింఛన్లు తీసివేస్తున్నారన్నారు.తాగునీరు సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు.తాగునీరు ఒక రోజు వస్తే వారం రోజులు రావని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో కనీసం వీధిలైట్లు కూడా లేవన్నారు. రోడ్లపైకి వస్తున్న మరుగును సైతం ప్రజలే శుభ్రం చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top