ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అంద‌డం లేదన్నా..


 క‌ర్నూలు:  టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదన్నా అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా త‌మ గ్రామానికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌ను ప‌లువురు విద్యార్థులు క‌లిశారు. ప్రొఫెషనల్‌ కోర్సు చదివేందుకు వెళితే  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని చెబుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని చెప్పి, ఇప్పుడేమో చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు.  బీఈడీ పూర్తి చేసిన వారికి ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పించాలని పత్తికొండ సెయింట్‌ పీటర్స్‌ బీఈడీ కళాశాల విద్యార్థినులు శ్రీలేఖ, షాహిన్, భాగ్యరేఖ, సరస్వతి, సుమిత్ర, సుశీల, నిర్మల, రజిత వైయ‌స్‌ జగన్‌ను  కోరారు. ఇందుకు స్పందించిన వైయ‌స్‌ జగన్‌ వచ్చే మన ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తామన్నారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఢోకా లేకుండా చూడడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామన్నారు.


Back to Top