చ‌లించిన జ‌న‌నేత‌


గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను చూసి చ‌లించిపోతున్నారు. ఒక్కొక్క‌రిది ఒక బాధ‌..త‌మ స‌మ‌స్య‌లు తీర్చే నాథుడు లేడ‌ని జ‌న‌నేత వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఇద్ద‌రు చిన్నారులు త‌మ ఆవేద‌న‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్ల‌డంతో జ‌న‌నేత చ‌లించిపోయారు.
‘అన్నా.. మా నాన్న సుభానీ రోడ్డు ప్రమాదంలో నడుము విరిగి మంచానికే పరిమితమయ్యాడు. మా అమ్మకు చెవిలో రంధ్రం ఏర్పడటంతో ఆపరేషన్‌ చేయించుకుని ఇంటి వద్దే ఉంటోంది. కుటుంబ పోషణ భారంగా మారడంతో చదువు మానేసి కూలి పనులకు వెళుతున్నాం. 11 ఏళ్ల తమ్ముడిని కూడా బడి మాన్పించి మెకానిక్‌ పనులకు పంపుతున్నాం’ అని చిన్నారులు షేక్‌ కరిష్మా, నజ్మాలు   ప్రజా  సంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుటుంబానికి సాయం చేయాలని వారు జననేతను కోరారు. వారి బాధలు విన్న వైయ‌స్ జ‌గ‌న్ చ‌లించిపో్యారు. ఇలాంటి ప‌రిస్థితి రాకుండా చూస్తాన‌ని వారికి హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top