<strong>జననేతకు మొరపెట్టుకున్న అంగన్‌వాడీ టీచర్ </strong>విజయనగరంః మాట వినలేదని టీడీపీ నేతల ఒత్తిడితో ఉద్యోగాన్ని తొలగించారని విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన అంగన్‌వాడీ టీచర్ వెంకటలక్ష్మి వైయస్ జగన్‌కు మొరపెట్టుకుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పార్టీ సభ్యత్వం తీసుకోవాలని టీడీపీ ఒత్తిడి చేశారని, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీరుమున్నీరయ్యింది. తనకు ఇద్దరు కూతుర్లు అని బతకడానికి దారిలేకుండా చేశారన్నారు. టీడీపీ నేతలు తన భర్త ఉద్యోగం కూడా పొగొట్టరన్నారు. కొంతమంది అధికారులు వచ్చి ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారని అనంతరం 10 రోజులకు ఆఫీస్‌కు పిలించి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వైయస్ జగన్‌ను కోరింది. న్యాయం చేస్తామని ఆమెకు జననేత భరోసా ఇచ్చారు. <br/><br/>