అప్పు తీర్చాలంటూ బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు..

రుణామాఫీ కాలేదని వైయస్‌ జగన్‌ డ్వాక్రా మహిళలు ఫిర్యాదు..
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో డ్వాక్రా మహిళలు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమకు ఎలాంటి రుణామాఫీ జరగలేదని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంత కట్టిన ఇంకా అప్పు ఉందంటూ బ్యాంకు అధికారులు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు.కట్టిన సొమ్ముంతా వడ్డీలకే జమ చేసుకుంటున్నారన్నారు. రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి అప్పుల్లో కూరుకుపోయామన్నారు. రుణాలు తీర్చాలని బ్యాంకు అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. పసుపు,కుంకుమ డబ్బులు జమ చేయలేదని వాపోయారు. టీడీపీ ప్రభుత్వం ఇల్లు,ఉద్యోగాలు,లోన్లు  వంటివి ఏమీ ఇవ్వలేదన్నారు. వైయస్‌ జగన్‌ వస్తేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు.
Back to Top