<strong>వైయస్ జగన్‌కు పారిశుధ్య కార్మికుల గోడు..</strong>శ్రీకాకుళంః వైయస్ జగన్‌ను కలిసిన రాజాం నగర పారిశుధ్య కార్మికులు తమ సమస్యలు చెప్పుకున్నారు.30 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 270 జీవో రద్దు చేయాలని కోరారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతుందన్నారు.కనీసం పిల్లలను చదివించుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నామన్నారు.టీడీపీ ప్రభుత్వం పారిశుధ్యకార్మికులను ఇక్కట్లు పాలు చేస్తుందన్నారు. వైయస్ జగన్ సీఎం అయితే తమ కష్టాలు తీరతాయన్న పారిశు«ధ్య కార్మికులు విశ్వాసవ్యక్తం చేశారు.