జన్మభూమి కమిటీలదే ఇష్టారాజ్యం..

టీడీపీ అరాచక పాలనపై పాలకొండ వాసులు ధ్వజం..
శ్రీకాకుళంః దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పాలకొండ ప్రజలు అన్నారు.ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఇళ్లు వంటి సంక్షేమ,అభివృద్ధి ఫలాలు ప్రజలందరికి అందాయన్నారు.టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి సంక్షేమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టిస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రకు శ్రీకాకుళం జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.వైయస్‌ జగన్‌ను కలవడానికి మహిళలు కూడా స్వచ్ఛందంగా రోడ్డుకు మీదకు వస్తున్నారన్నారు. పాలకొండ నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందడం లేదన్నారు.తోటపల్లి ఆధునికీకరణ కోసం వైయస్‌ఆర్‌ రూ.146 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం వైయస్‌ఆర్‌ మరణంతో ప్రాజెక్టు పూర్తికాకుండా పోయిందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.వైయస్‌ జగన్‌ వస్తే తోటపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తారనే విశ్వాసంతో ప్రజలందరూ ఉన్నారన్నారు.
Back to Top