సర్కార్‌ తీరుపై అన్నదాతల ఆగ్రహం

అనంతపురం: సోలార్‌ పావర్‌ ప్లాంట్‌ కోసం భూములు తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌కు నంబుల పూలకుంట, కొత్తపల్లి గ్రామాల రైతులు తమ సమస్యలు వివరించారు. ఎన్‌పీ కుంట వద్ద ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లాంట్‌ కోసం రైతుల వద్ద నుంచి భూములు సేకరించిన ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. పట్టా భూములు ప్రభుత్వం తీసుకొని పైసా కూడా ఇవ్వకపోవడంతో అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైయస్‌ జగన్‌కు వివరించారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
 – పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు, పోలవరం అవినీతిపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుంది. అవినీతి పరులు, అక్రమార్కులకు చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో 90 శాతం పూరై్తన ప్రాజెక్టులకు చంద్రబాబు గేట్లు ఎత్తుతున్నారు. ధర్మవరంలో చేనేత మహిళల కష్టాలు చూశాకే 45 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. 
 
Back to Top