బకాయిలు చెల్లించడం లేదయ్యా...

జననేతను కలిసిన రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు..
విజయనగరంః  రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి చెరకు రైతుల సమస్యలను వివరించారు. లచ్చయ్యపేట షుగర్‌ ఫ్యాక్టరీ చెరకు రైతుల బకాయిలు చెల్లించలేదని జననేతకు ఫిర్యాదు చేశారు.  నాలుగేళ్లలో బొబ్బిలిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులు వలసలు పోవాల్సివస్తోందన్నారు. సుమారు రూ.13 కోట్ల రూపాయలు షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు బకాయిలు ఉన్నా మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు నీమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. బకాయిలను చెల్లించకుండా మళ్లీ క్రషింగ్‌కు షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం సిద్ధపడుందన్నారు.తోటపల్లి ప్రాజెక్టు  మిగిలిన 10 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.ఐదు మండలాలకు చుక్క సాగునీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Back to Top