కర్నూలు: చంద్రబాబు ప్రభుత్వం రైతుల పంట రుణాలకు సంబంధించి వడ్డీ రాయితీలు ఇవ్వడం లేదని రైతు అశోక్‌కుమార్‌రెడ్డి వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ప్రతిపక్ష నేతను కలిశారు. మాది నందికొట్కూరు నియోజకవర్గం వడ్డెమాను గ్రామం. మా గ్రామంలో రైతులు సహకార బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలకు వడ్డీ రాయితీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఇప్పటికి వరుసగా రెండేళ్ల నుంచి రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వడం లేదు. రూ.90 వేలు రుణం తీసుకున్న నేను ప్రభుత్వం వడ్డీ ఇవ్వకపోవడం వల్ల రూ.1.14 లక్షలు కట్టాల్సి వస్తోందన్నా’ అని ఓ రైతు వైయస్ జగన్‌కు వివరించాడు. వైయస్ జగన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని, మన ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.<br/>