వేతనాలు పెంచకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నా..

వైయస్‌ జగన్‌కు వినతించిన ఏఎన్‌ఎంలు
విజయనగరంః విజయనగరం జిల్లా ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి ఏఎన్‌ఎంలు  తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాష్ట్రంలో 7 వేలకు పైగా ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారని, వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలేదన్నారు. సుమారు 11 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా రెగ్యులర్‌ చేయడం లేదన్నారు. దివంగత వైయస్‌ఆర్‌ హయాంలో ఎప్పుడూ  రోడ్డుమీదకు రాలేదని, టీడీపీ ప్రభుత్వం పాలనలో మహిళలు రోడ్డుమీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.2007లో వైయస్‌ఆర్‌ మాకు ఉద్యోగాలు ఇచ్చారని,మళ్లీ ఆయన తనయుడు మా ఉద్యోగాలను రెగ్యులర్‌ చేస్తారని నమ్ముతున్నామన్నారు.

Back to Top