ఎముక లేని చెయ్యి నరం లేని నాల్క...అంటే ఎవరి సంగతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో గదా! మనం బాబోరి గురించే. ఎంత ధర్మ ప్రభువు కాబోతే మావోల చేతిలో మరణించిన గిరిజన నేతల ఇంట్లో మనిషికో 10లక్షలు ఇస్తానని మాటిస్తాడు. కిడారి కుటుంబంలో ఉన్న నలుగురికి తలకో 5లక్షలు పార్టీ పరంగా అందిస్తానంటాడు. మరదేంటి బాబుగారి కోసం తాను గెలిచిన పార్టీని కాదని, ఎన్నుకున్న ప్రజలను వద్దని, నమ్మని ఆశయాలను పొమ్మని వచ్చి టిడిపిలో చేరారుగదా కిడారి. ఆయన కుటుంబానికేమో ఒక ప్రభుత్వోద్యోగం మనిషికి ఐదు లక్షలు ఇస్తామని, మాజీ ఎమ్మెల్యే సోమ గారి కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు మనిషికి పదిలక్షలు ప్రభుత్వం తరఫునా ప్లస్ మరో 5 లక్షలు పార్టీ తరఫునా అని అన్నాడు. అంతేనా విశాఖపట్నంలో ఇంటి స్థలం, అరకులో అర్థంతరంగా ఆగిన ఇంటి నిర్మాణం పూర్తి చేసి పట్టా కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు.అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కుటుంబానికంటే మాజీ ఎమ్మెల్యే పైనే బాబుగారి కరుణ, కృప ఎక్కువగా ఉన్నట్టుందే అనుకుంటున్నారు స్థానికులు. కాదూ మరి...!! పక్క గూటి నుంచి వచ్చిన నేతకు, సొంత గూటి పక్షికీ ఆ మాత్రం బేధం ఉండదా అని కూడా గుసగుసలాడుతున్నారు. ఇంత చర్చ జరుగుతుండగానే వచ్చిన ఓ పెద్దాయన ఇలా అంటున్నాడు...''మీ ముఖం బాబు ఎప్పుడూ చెప్పింది చేయడు, చేసేదైతే చెప్పనే చెప్పడు...ఇదీ అంతే...బాక్సైటు తవ్వుడైనా, గిరిజన యూనివర్సిటీ అయినా, కొండోళ్లకు ఇళ్లు, స్థలాలన్నా, ఇంటికో ఉద్యోగం అన్నా...అన్నీ అంతే...చెప్పేప్పుడు చేతికి ఎముకుండదు...తిరిగి అడిగితే నాలిక్కి నరం ఉండదు...''నిజమే గా మరి....బాబోరు గురించి మాబాగా తెల్సినపెద్దాయన పాతికేళ్లఅనుభవంతో చెప్పిన సత్యం ఇది !!!