<br/>టమాటాలూ కోడిగుడ్లూ విన్నాం గానీ ట మాటలు ఏమిటనుకుంటున్నారా? చంద్రబాబు మాటల్ని ఈ మధ్య అందరూ ఇలాగే పిల్చుకుంటున్నారు. అవి టమాటాలకు ఎక్కువ మాటలకు తక్కువగా ఉంటున్నాయి మరి. రైతులు, రైతాంగ హక్కులు, చివరకు జీరో బడ్జెట్ వ్యవసాయం అంటూ నానారకాల టమటాలు మాట్లాడారు బాబుగారు. ఐక్యారాజ్య సమితి కాని అంతర్జాతీయ వేదిక కు ఐక్యరాజ్య సమితి పేరెట్టేసుకుని మరీ అక్కడకెళ్లి వ్యవసాయం గురించి మాట్లాడేసాడు. చెప్పేవాడు చంద్రబాబైతే వినేవాళ్లంతా వ్యాపారవేత్తలే. అందుకే జీరో బడ్జెట్ వ్యవసాయానికి వేల కోట్ల పెట్టుబడులు, ఎమ్ఓయూలు కూడా జరిగాయి. ఇక వ్యవసాయానికి సాయమే చేయని ముఖ్యమంత్రికి వ్యవసాయ సంబంధిత పురస్కారాలు పరుగెత్తుకు వచ్చి వళ్లో పడుతున్నాయి. బాబుగారి రైతు ప్రేమ ఏపాటిదో నిన్నటి అనంతపురం వార్తలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. శీతల గిడ్డంగులు లేక టమాటాలు నిల్వ చేసుకోలేక, అమ్ముకుందామంటే ధర లేక రైతులు టమాటాలను నేలపై పారబోసిన తీరు చూసే తీరాలి. నేలపై రక్తం ధారలు కట్టినట్టు కోకొల్లుగా పడున్న క్వింటాళ్ల కొద్దీ టమాటాలు రైతుల రక్తానికి ప్రతీకలే. ఇదీ బాబుగారి వ్యవసాయరంగ ప్రేమ. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట దాచుకునే గిడ్డంగులే లేవు. ఉన్నవాటిలో బాబుగారి ఆర్భాటాల ఖజానాలు నిక్షిప్తం చేసుంచారు. అదేనండీ ఇదే అనంతలో రైతులకు రైయిన్ గన్లంటూ ఇచ్చారు గదా. ముఖ్యమంత్రి వెళ్లిన మర్నాటి నుంచీ వాటిని భద్రంగా తీసుకెళ్లి ఈ గిడ్డంగుల్లోనే దాచిపెట్టారు. బైట పెడితే కోట్ల ఖరీదుతో కొన్న వస్తువులు పాడౌతాయనట. మరి ఎండనక, వాననక శ్రమించి రైతు పండించన పంట కోట్ల ఖరీదు చేయదు. అసలు రైతుకు ఖరీదే చేయదు. బాబగారి మాటల్లో రైతులపై వల్లమాలిన ప్రేమ, అంతులేని సాయం ఒలికి పోతుంటాయి. కానీ వాస్తవంలో రైతు కష్టం ఇలా నేలపాలై పోతుంటాయి. చూడటానికి చక్కగా పండినా పనికిరాకుండా నేలమీద ఒలికిపోయిన ఆ టమాటాల్లాగే చంద్రబాబు మాటలు కూడా ట*మాటలు*. ఇవి టక్కుటమార గారడీ విద్యలు. <br/>