సుజనా చౌదరికి చుక్కెదురు

ఈడీ  సుజనా చౌదరి గారూ 5700 కోట్లు బాంకులకు పంగనామం పెట్టారు తమరు...దీనికి మీ సమాధానం?
సుజనా చౌదరి  బ్యాంకులన్నవి అప్పులివ్వటానికే కదా. వాళ్లిచ్చారు మేం తీసుకున్నాం.
ఈడీ  అప్పులు తీసుకున్నప్పుడు చెల్లింపులూ చేయాలి కదా? మీరు అప్పులు తీసుకున్న కంపెనీలు దివాళా తీస్తే రుణాలు ఎలా తీరుస్తారు? మీపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేస్తున్నాం.
సుజనా చౌదరి  కంపెనీలు నష్టాల్లో ఉంటే మాత్రం మీరు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చేస్తారా? 
ఈడీ  బీసీఈపీఎల్ డైరెక్టర్లు ఈ కంపెనీకి మీరే ఛైర్మన్ అని చెప్పారు. మరి ఈ కంపెనీ పేర తీసుకున్న రుణాలు ఏమయ్యాయి?
సుజనా చౌదరి  ఈడీ అసత్య ఆరోపణలు చేస్తున్నది. వీటికి ఆధారాలు లేవు. ఈడీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. దీన్ని న్యాయపరంగా ఎదుర్కుంటాం.
ఈడీ  120 షెల్ కంపెనీల తాలూకు రబ్బరు స్టాంపులు మీ ఆఫీసు, ఇళ్లల్లో చేసిన సోదాల్లో బయటపడ్డాయి.
సుజనా చౌదరి  వాటి నుండి నేనెప్పుడో తప్పుకున్నాను. ఇప్పుడు వాటిలో నేను డైరెక్టర్ గా కొనసాగడం లేదు.
ఈడీ  ఉనికిలోలేని కంపెనీల పేర ఖరీదైన రేంజ్ రోవర్, ఫెరారీ, బెంజ్ కార్లు మీ వద్ద ఉన్నాయి.
సుజనా చౌదరి  అబ్బే ఉన్న ఖరీదైన కార్లన్నీ మా డ్రైవర్లవి. నేను కేవలం ఓనర్ ఉద్యోగం చేస్తున్నా...అంతే.
ఈడీ  ???? 
సుజనా చౌదరి  ఈడీ నాపై కక్ష సాధింపు చేస్తోంది. హైకోర్టు ఈడీ సమన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వండి. 
హైకోర్టు  అబ్బే ఆ అవకాశం లేదు. సిబిఐని మీ రాష్ట్రం ఆపగలదేమో కానీ, ఈడీని కాదు. అధికారులు పిలిచినప్పుడు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకండి. 
సుజనా చౌదరి  ??? 

 
Back to Top