రావయ్యా బాబయ్యా ....

 

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎపి ముఖ్యమంత్రి, తమ తాజా మిత్రుడు చంద్రబాబును మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానం పంపించాడు. ఎలా అయినా సరే తప్పకుండా చంద్రబాబు ఈ ప్రమాణ స్వీకారాలు చూసి తీరాల్సిందే అని పట్టుబడుతున్నాడట రాహుల్ గాంధీ. 

తెలుగుదేశంతో కలిసి వెళ్లిన పాపానికి తెలంగాణాలో తగిలిన ఎదురుదెబ్బ మర్చిపోయి రాహుల్ మళ్లీ బాబు జపమే చేస్తున్నాడంటూ కాంగ్రెస్ సీనియర్లు గుర్రుమంటున్నారు. కానీ ఏం చేయగలరు పాపం చారిత్రిక తప్పిదాలు అలా జరిగిపోతూ ఉండటం కాంగ్రెస్ ఆనవాయితీ కదా. అలాంటి తప్పిదమే బాబుతో పొత్తు అని తెలుసుకునేసరికి తెలంగాణాలో కాంగ్రెస్ జీవితం మళ్లీ తెల్లారిపోయింది. 2014లో కనీసం 21 గెలిచిన కాంగ్రెస్, 2018లో 19 దగ్గరే చతికిల పడింది. ఇక చంద్రబాబునైతే తెలంగాణా ప్రజలు దారుణంగా తృణీకరించారు గత ఎన్నికల్లో 15 సీట్లు ఉన్న టిడిపిని 2ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంతటి భారీ పరాభవం తర్వాత కూడా రాహుల్ చంద్రబాబును ఇతర రాష్ట్రాల్లో గెలుపు సంబరాల్లో వచ్చి చేరమని ఆహ్వానించడం ఏమిటా అని కాంగ్రెస్ నేతలు గరం గరం అవుతున్నారు. చంద్రబాబు కాలు పెట్టని ప్రతిచోటా కాంగ్రెస్ గెలిచింది. బాబు నీడ పడ్డందుకే కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చావుతప్పి కన్నులొట్టపోగా జేడీఎస్ తో కలిపి తేరుకోగలిగింది. బాబు గాలి కూడా పడని మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోగలిగింది. తెలంగాణాలో చంద్రబాబును వెంటేసుకుని తిరిగిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించడంతోనే ఈ చంద్రగ్రహనం వదలకుండా పట్టుకుందని కొందరు ఆ పార్టీ నేతలు విసుక్కుంటున్నారు. కాబోయే మిత్రుడు కదా అని అప్పుడూ ఇలాగే ప్రమాణ స్వీకారానికి పిలిస్తే ఒక్కపూటకు పదిలక్షలు హోటల్ బిల్ చేసి  పీల్చి పిప్పిచేసి వదిలిపెట్టాడు.  మరి కర్ణాటకలో ఉన్నది ఎల్లో మీడియా కాదుగదా బాబు భాగోతాలు గోనెసంచిలో మూటకట్టి పెట్టడానికి, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం రాబట్టి లోకల్ నాన్ లోకల్ అని తేడా లేకుండా వాయించిపారేసాయి. ప్రభుత్వం సొమ్ముతో బాబు జల్సాలంటూ జాతీయ మీడియాలో ముఖం చూపించనీకుండా చేసాయి. మళ్లీ ఇప్పుడు మూడు ప్రమాణ స్వీకారాలకు బాబును పిలిస్తే ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతాడో అంటూ అప్పుడే ఆయా రాష్ట్రాల్లో డిబేట్ లు మొదలెట్టేసారు.  బాబు లాంటి జల్సానాయుడిని పిలిచి ప్రజల సొమ్మను పాప్ కార్న్ లా తింటున్నారంటూ కాంగ్రెస్ పై కారాలు మిరియాలూ నూరుతున్నార్ట. ప్రమాణ స్వీకారంలో బాబు లెగ్గు మహిమవల్లో ఏమో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం పూటకో సవాల్ తో అటు ఇటుగా అయ్యింది.

బాబు చుట్టూ వైఫైలా  నెగిటివ్ నెట్వర్క్ ఉంటోంది. దాని చుట్టుపక్కలకు వెళ్లిన వాళ్లు బూడిదైపోవడం ఖాయం. దీని గురించి ఇంత అనుభవపూర్వకంగా తెలిసాక కూడా రాహుల్ గాంధీ చంద్రబాబును ఎందుకు మళ్లీ ఆహ్వానిస్తున్నాడా అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి ఆ పార్టీ మేధావులే శోధించి సాధించిన సమాధానమేంటంటే...బాబు లెగ్గు గురించి తమ పార్టీకి తెలిసినట్టే దేశంలో ఉన్నఇతర పార్టీలన్నిటికీ తెలియాలని, ఈ ఎన్నికల ఫలితాలు బాబుతో చేయి కలపాలనుకున్న పార్టీలన్నిటికీ గుణపాఠం కావాలని రాహుల్ ఆలోచన కావచ్చని కాంగ్రెస్ మేధావుల ఊహ. ఇక ముందు ఏ కూటమిలో అయినా బాబుతో చేయి కలపకపోతే తమ హస్తానికి వచ్చినట్టు ఇన్ని రాష్ట్రాల్లో గెలుపు దక్కుతుందని సింబాలిక్ గా చెప్పడమే రాహుల్ ఉద్దేశ్యం అనుకుంటున్నార్ట. అయినా పాపం వాళ్ల దూరాలోచన కానీ అంత యోచనే ఉంటే రాహుల్ బాబు సైకిలెక్కేవాడా, హస్తాన్ని బాబు హస్తగతం చేసి తెలంగాణాలో చేయి కాల్చుకునేవాడా?? మొత్తానికి రావయ్యా బాబయ్యా అంటూ మరోసారి ఆహ్వానం               

Back to Top