కలలో ఎన్టీయార్

ఛాంబర్ లో కునుకుతీస్తున్న చంద్రబాబు కలలోకి ఎన్టీయార్ వచ్చాడు

బాబు వులిక్కిపడి మీరా మామగారూ, కలలోకి వచ్చారేంటి? అన్నాడు
కలలోకి కాకుండా నిజంగా నేను కనిపిస్తే నువ్వు మళ్లీ నన్ను పొడుస్తావు. నాకు తెలియదా ?అన్నాడు ఎన్టీయార్
"మీ ఆశయాలని నేను నెరవేరుస్తున్నాను" అన్నాడు బాబు
బతికుండగానే నన్ను చంపి, చచ్చాక నా విగ్రహానికి దండలేస్తున్నావా బాబూ
అయ్యో ఎంతమాట మామగారూ..
అవును, ఒక విషయం చెప్పు? పార్టీ పెట్టమని నువ్వు నాకు సలహాలు ఇచ్చావా?
మీరు లేనప్పుడు మీ గురించి ఏం చెప్పినా చెల్లుబాటవుతుందని ఏదో అనేసా!!
సరే, అసలు జరిగిందేమిటో చెబుతా విను. నేను పార్టీ పెట్టినప్పుడు నువ్వు కాంగ్రెస్ లో వున్నావు. రంగులేసుకునేవాడికి ఓట్లు ఎవరు వేస్తారని అన్నావు. నా మీదే పోటీ చేస్తానని సవాల్ చేసావు. జ్యోతిలక్ష్మి వచ్చినా సభలకి జనం వస్తారని ఎద్దేవా చేసావ్. అవునా కాదా? హుంకరించాడు ఎన్టీయార్
"అవును" అన్నాడు బాబు భయంగా
చివరికి నా అభ్యర్థి రామానాయుడు చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయావు. ప్రభుత్వం వచ్చాక నక్కలాగా వినయంగా చెంతచేరావు. అవకాశమొచ్చినప్పుడు పక్కలో బల్లెంలాగ తాయరయ్యావు. కుట్రలతో కుతంత్రాలతో తెలుగుదేశం పార్టీనే నాకు లేకుండా చేసి నామీద చెప్పులు వేయించావు. నేను పోయిన తరువాత నన్ను పొగుడుతున్నావ్ అన్నాడు ఎన్టీయార్
అవసరమైనప్పుడు పొగడ్డం, అవసరం తీరాక తిట్టడం నా అలవాటు మామా
నేను కలలో కనిపించినా నాకు వెన్నుపోటు పొడుస్తావని నాకు తెలుసు. అందుకే ఎక్కువసేపు వుండకుండా వెళ్లిపోతున్నా అని ఎన్టీయార్ మాయమయ్యాడు.
చంద్రబాబు వులిక్కిపడి లేచి ఎన్టీయార్, ఎన్టీయార్ అని అరిచాడు
అది చూసి లోకేష్ సంతోషపడి నిద్రలో కూడా మా నాన్న ఎన్టీయార్ జపం చేస్తాడు అని అందరికి చెప్పాడు
లోకేష్ ని పిలిచి చంద్రబాబు అది జపం కాదు, భయం. మీ తాత దగ్గరనుండి మనం పార్టీని లాక్కున్నాం. అది ఆయన కష్టార్జితం. ఇంకొకరి సొమ్ముని దోచుకోవడం నాకు చిన్నప్పటినుంచి అలవాటే. మనం వెన్నుపోటు పొడిస్తే, మనల్ని వెన్నుపోటు పొడిచేవాళ్లు కూడా వుంటారు, అదే రాజకీయం అన్నాడు
మనల్ని ఎవరు పొడుస్తారు నాన్న. మనమే జనానికి వెన్నుపోటు పొడుస్తున్నాం. 
ఏమో భవిష్యత్తు ఎవరు చెప్పగలరు? నువ్వు ఇప్పుడు మంత్రివి. నీకే అధికారం మీద ఆశపుట్టి నన్ను పొడుస్తావేమో అన్నాడు బాబు
వూరుకోండి నాన్న. నాకు వెన్నుపోటు పొడిచేంత తెలివితేటలున్నాయా?
అవి వుండకూడదనే, చిన్నప్పటి నుంచి నిన్ను డమ్మీలా పెంచాను
నీకు కలలోనూ భయమే, మెలకువలోనూ భయమే అన్నాడు లోకేష్
Back to Top