నిప్పులను వణికిస్తున్న తప్పులేమిటో?


అమాత్యులపై ఐటి దాడులు జరిగితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అరిచి గోల చేస్తున్నారు.. ఎక్కడో బాంబులు పడ్డాయంటే పక్కలో వెతుకున్నట్టుందీ బాబగారి యవ్వారం. అవినీతి చేసిన తిమింగలాలు ఉంటే ఐటి శాఖ గేలానికి చిక్కుతాయి. దానికి బాబుగారు వణకడం ఎందుకు? 
మంత్రి నారాయణ గారి నారాయణా కాలేజీలో ఐటి శాఖ ఎంటరైతే బాబుగారి చెమటలు పడుతున్నాయి. 
నెల్లూరు మస్తాన్ రావు ఇంట్లో సోదాలు జరిగితే బాబుగారికి బెంగ పుట్టుకొస్తోంది. 
కందుకూరు మాజీ టిడిపి నేత పోతుల రామారావు ఇంట్లో ఐటి సోదాల గురించి విని బెంబేలెత్తుతున్నారు.
టంగుటూరులో సదరన్ గ్రానైట్ కంపెనీలో, జరుగుమిల్లిలో సదరన్ ట్రోపికల్ ఫుడ్స్ లో ఐటి దాడులు అమరావతిలో కలకలం రేపుతున్నాయి.
గుంటూరులో విఎస్ లాజిస్టిక్స్ లో, జగ్గయ్యపేటలో విఎస్ఎకో లైట్ వెయిట్ బ్రిక్స్ కంపెనీల్లో ఐటి దాడులు జరిగితే రాజధానిలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. 
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వ్యాపారులు, కాంట్రాక్టర్లను ఐటి అధికారులు తాకితే చాలు ప్రభుత్వంలో ప్రకంపనలు పుడుతున్నాయి. 
అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏమూల అవినీతి కంపు కొట్టినా అది అమరావతికి పాకుతోంది. 
నిప్పును నేను అంటూ చెప్పుకునే చంద్రబాబుకు ఐటి దాడులు అంటేనే  అంత వణుకేమిటా అని ఆంధ్రా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 


 

తాజా వీడియోలు

Back to Top