<p style="" text-align:justify=""><br/><p style="" text-align:justify=""> తెలుగు భాషా పాండిత్యంలో, విషయ పరిజ్ఞాన వివేకంలో, నాలికని మెలితిప్పి మహోగ్రంగా మాట్లాడటంలో చినబాబుకు లేరు సాటి. కారెవరూ పోటీ అని తెలుగు తమ్ముళ్లు తెగ బాకా ఊదుతారు. అఫ్ కోర్సు ఆ పాండిత్య ప్రభ ప్రతిభ తెలియని తెలుగువారు లేరనుకోండి. అయినా సరే మా చినబాబుతో నే పోటీ పడతా అంటున్నారు టిడిపి మంత్రి ఆదినారాయణ రెడ్డి. మాట్లాడేటప్పుడు ఆలోచన పాలోచన విచక్షణ వివేచన అనేవి మచ్చుకు కూడా ఉండకూడదు అనే టీడీపీ సూక్తిని నీతిని సిద్ధాంతాన్నీ వంటపట్టించుకున్న ఈ మంత్రి వర్యులు నిన్నటి క్రిస్టమస్ పండుగ ప్రాధాన్యాన్ని వివరించారు. జీసస్ క్రైస్ట్ వర్థంతి రోజే ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారంటూ తన జ్ఞానాన్ని పంచిపెట్టారు. అది విన్న అందరికీ లోకేష్ ను మించిన ఆదేష్ మన ఆదినారాయణ రెడ్డి అన‌్న విషయం అర్థం అయ్యింది.</p><p style="" text-align:justify="">తెలుగుదేశంలో అధ్యక్షుల వారి నుంచి మంత్రి వర్యుల వరకూ అందరిదీ ఒకటే ధోరణి. ఆశువుగా అలవోకగా ప్రసంగాలు చేసేయడం. అందులో ఆణిముత్యాలు ఏరుకుని ప్రజలు ఆనందపడటం. ఆదినారాయణ రెడ్డి వదిలిని ఆణిముత్యం కూడా ఇలాంటిదే మరి. ఏసు పుట్టిన రోజు అయిన క్రిస్ట్ మస్ పండుగను ఏసు మరణించిన రోజంటూ ప్రకటించి తన తెలివిని ప్రదర్శించి, మరోసారి తెలుగుదేశం నేతల వాచాలవ్వాన్ని బయటపెట్టినందుకు ఆయన్ను అభినందించాలి. ప్రసంగాలను పచ్చడి చేయడంలో, తప్పుల పప్పులు దొర్లించడంలో నారా లోకేష్ కే పోటీగా నిలుస్తున్న ఆదినారాయణ రెడ్డిని ప్రోత్సహించాలని భావిస్తున్నార్ట తెలుగు తమ్ముళ్లు. </p></p>