కత్తియుద్ధం కౌగిలింత


కదన రంగంలో కరవాలాలు జజ్జనక ఝణ ఝణ ఝణ అంటున్నాయి. కళ్లల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఇద్దరు అరివీర భయంకర యోధులు రెండు వర్గాల తరఫున పోరాడుతున్నారు. భీకరంగా తలపడుతున్నారు. ఎవరూ తక్కువ కావడం లేదు. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. నువ్వు వెధవవి అంటే, నువ్వు వెధవన్నర వెధవ్వి అనుకుంటున్నారు. నీ జీవితం మా భిక్ష అని ఒకరంటే, మా వల్లే మీ జీవితం అని మరొకరు హుంకరిస్తున్నారు. ఇంతలో శంఖారావం వినిపించింది. రెండు కత్తులూ కిందకు దిగాయి. యుద్ధం ముగిసింది. ఎవరిదోవన వారు పోయారు.  ఇక ఈ రెండు వర్గాలకూ వైరమే అనుకున్నారు అంతా. కొన్నాళ్లకు ఒకే భవనం వద్ద అంతకుముందు అరివీర భయంకరంగా కొట్లాడుకున్న ఆ ఇద్దరూ ఆలింగనాలు చేసుకుంటూ కనిపించారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి కత్తికంటిన మట్టి ఒకరు తుడుచుకున్నారు. ఒకరిచేతిలో ఒకరు చేతులు వేసుకుని ఈబధం ధృఢమైనది అని పాడుకున్నారు. నువ్వు ముందు అంటే కాదు నువ్వే ముందు అంటూ ఒకరినొకరు తోసుకుంటూ ఆ కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. వీరి వైరం ఎప్పుడు మైత్రీ బంధమైందా అని ఆశ్చర్యపోయారు లోకులు. 
బీజేపీ మీద టీడీపి ధర్మపోరాట దీక్షలు చేస్తుంది. టిడీపీ మీద బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తుంది. పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు బీజేపీని తిడతారు. రాష్ట్ర శాసనసభలో బీజేపీ మంత్రులు టిడిపి మంత్రిమండలి నుంచి వైదొలుగుతారు. చంద్రబాబు మోదీని విమర్శిస్తుంటారు. చంద్రబాబు మా స్నేహపాత్రుడు అని రాజనాథ్ సింగ్ ఆప్యాయత ప్రదర్శిస్తారు. ఈ నాటకాలకు క్లైమాక్సే పైన చెప్పుకున్న కథ. నర్సీపట్నంలో ఓ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాల్సిన టిడిపి మంత్రి ఆయ్యన్న పాత్రుడు ప్రొటోకాలన్ కూడా పక్కనపెట్టి మాజీ బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు చేతుల మీద జరిపించాడు. కత్తులు పట్టుకున్న పాత్రలు రాజకీయ అవసరాలకోసం రంగులు మార్చడాన్ని చూసి ప్రజలు నివ్వెరపోయారు. 
 
Back to Top