జగన్ ను అనుకరిస్తున్న బాబు

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు మాట తీరు చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఆకర్షించేలా మాట్లాడాలన్న తపనతో వైఎస్ జగన్ తీరును చంద్రబాబు అనుకరిస్తున్నాడంటున్నారు. గత మూడు రోజులుగా బాబు ప్రసంగాల్లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు. 
లైవ్ ఎగ్జాంపుల్ చూపించడం
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జరిగే బహిరంగ సభలో ఖాళీ అంబులెన్సును తిప్పడం చూసి ఇది ప్రభుత్వం చేస్తున్న దొంగచాటు చర్య  అంటూ విమర్శించారు వైఎస్ జగన్. దీనిపై టీడీపీ శ్రేణులు వెంటనే భుజాలు తడుముకున్నాయి. దానిపైన రిపోర్టు అంటూ హంగామా సృష్టించాయి. ప్రతిపక్ష నేత మాటల బాణాలకు టిడిపి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతూ, భుజాలు తడుముకుంటూ, ప్రూఫులు చూపించుకోవడం చూసి ప్రజలంతా నవ్వుకున్నారు. అయితే ఇదే తరహా మాటలను చంద్రబాబు హైదరాబాద్ లో, ఖమ్మంలో జరిగిన బహిరంగ సభల్లో మక్కీకి మక్కీ ఉపయోగించేసాడు. పైన తిరిగే హెలికాఫ్టర్లను చూపిస్తూ నరేంద్రమోదీ ఆ హెలికాఫ్టర్లను తనను గమనించేందుకు పంపిచాడని చెప్పుకొచ్చారు. 
గతంలో నారా లోకేష్ సైతం ధర్మపోరాట దీక్ష వంటి సభావేదికలపై ప్రతిపక్ష నాయకుడు జగన్ ను అనుకరించాలని ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు. ఇప్పుడు అదే దారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నించడం చూస్తే జగన్ ప్రభావం టిడిపి పై బాగానే పడినట్టుంది అనిపిస్తోంది. వైఎస్ జగన్ కు ఉన్న విపరీతమైన ప్రజాభిమానం, ఫాలోయింగ్ సంపాదించుకోవాలనే ఆయన్ను అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు  నారా నాయకులు. అయితే జగన్ స్టైల్ ను అందిపుచ్చుకోలేక కాపీ మాస్టర్లుగా ప్రజల దృష్టిలో మిగిలిపోతున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top