విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడు చంద్రబాబునా పరిపాలనలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇంకా జరుగుతాయి. నా హయాంలో మనకు నోబుల్ బహుమతి కూడా వస్తుంది. తెచ్చినవాళ్లకి నేను వందకోట్లు ఇస్తాను. అని ప్రకటించాడు బాబు.ఒక విలేకరి లేటి గుర్రం ఎగిరినా ఎగురుతుందనుకోవడం బాగుంది. అరచేతిలో స్వర్గం చూపడం మీకు కొత్తేమీ కాదు. చేసినా చేయకపోయినా కలలు మాత్రం కలర్ లో చూపిస్తారు. నోబుల్ సంగతి తర్వాత గానీ ముందు మన స్కూళ్లు ఎలా వున్నాయో చూద్దాం పదండి అన్నాడుమారువేషం వేసుకోమంటావా? అని అడిగాడు బాబుఅక్కర్లేదు మీ వేషాల్ని జనం బాగానే గుర్తుపడుతున్నారు పదండిమొదట ఒక పల్లెటూళ్లో హై స్కూల్ కి వెళ్లారు. అది ఇంటర్వెల్ సమయం. పిల్లలంతా ఒక చెట్టుకింద ఒకటి పోసుకుంటున్నారు. అదేంటి మూత్రశాలలు లేవా? అని అడిగాడు బాబుమీరూ మోదీ స్వచ్ఛభారత్ అని అరుస్తున్నారు కానీ, ఎన్ని స్కూళ్లలో మూత్రశాలలున్నాయో, ఒకవేళ వున్నా ఎన్ని స్కూళ్లలో నీటిసౌకర్యం ఉందో చెక్ చేసుకోండిఅయినా టాయిలెట్లకి , శాస్త్ర విజ్ఞానానికి ఏంటి సంబంధం? అని బుకాయించాడు బాబుకరెక్టే అది కూడా చూద్దాం పదండిఅంటూ విలేకరులు ఒక కుర్రాన్ని పిలిచి బాబూ ఇక్కడ ల్యాబ్ ఎక్కడ? అని అడిగారుఈయన చంద్రబాబని తెలుసుకానీ, ల్యాబ్ ఎక్కడుందో తెలియదు అన్నాడుఇది సంగతి. ల్యాబ్ ఎట్లా వుంటుందో తెలియకపోతే, ఇక వీళ్లు సైన్స్ లో పరిశోధనలు చేసి నోబుల్ ప్రైజులు తెచ్చేదెప్పుడుఅయినా ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో ఎవరు చదువుతున్నారు? అందరూ మా మంత్రి నారాయణ స్కూళ్లో చదువుకుంటున్నారు అని మళ్లీ బుకాయించాడు బాబుమీ నారాయణని కూడా చూద్దాం పదండినారాయణ స్కూల్ కెళ్లారు. ఒక అపార్ట్ మెంట్ లో నడుస్తూ వుందది. ఇరుకిరుకు గదుల్లో పిల్లలంతా వున్నారు.ఒక టీచర్ ను పిలిచి ల్యాబ్ ఎక్కడుంది అని అడిగారుల్యాబ్, ల్యాబంటే..అయినా చెకింగ్ కి వస్తామని ముందే ముందేచెబితే మా ఏర్పాట్లేవో మేము చేసుకుంటాం కదా అన్నాడా టీచర్ఏర్పాట్లంటే అని అడిగాడు బాబుఎవరైనా విఐపి వస్తే, ముందే ఆరేంజ్ చేసిన ప్రాంతాలకి మీరు తీసుకెళ్లినట్టు, వీళ్లకి కూడా ముందే చెబితే ల్యాబ్ ని సృష్టిస్తారు. ల్యాబ్ మాత్రమే కాదు, అవసరమైతే బాల సైంటిస్టులు కూడా అప్పటికప్పుడు పుట్టుకొస్తారు.ఒక గదికి ల్యాబ్ అని రాసుంటే అందులోకి వెళ్లారు. అక్కడే పాత సామానులు కనిపించాయి.ఇవేంటి? అన్నాడు బాబుసైన్స్ పరికరాలుఅయినా మేధస్సు దానంతటదే పుట్టుకు రావాలే తప్ప, ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు అన్నాడు బాబుదానంతటదే పుట్టుకురావడానికి అదేం అమరావతి నగరం కాదు, సైన్స్. స్కూళ్లని ఇట్లా అధ్వాన్నంగా పెట్టి నోబుల్ ప్రైజ్ గురించి లెక్చర్లిస్తూ వుండండి అని విలేకరులు వెళ్లిపోయారు.