చంద్రబాబు ఈవెంట్ మేనేజ్ మెంట్

విశాఖలో ఓ ప్రైవేటు సదస్సులో పాల్గొన్న చంద్రబాబుగారు ఓ మహత్తరమైన విషయాన్ని తెలియజేసారు. డైరెక్టుగా తనో ఈవెంట్ మేనెజర్ ని అని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రోజుకో కథ చెప్పి ఎలాగోలా మేనేజ్ చేస్తున్నా కాని, పెట్టుబడిదారులను మాత్రం మేనేజ్ చేయలేకపోతున్నా అని ఫీలయ్యారు. తన మేనేజ్ మెంట్ స్కిల్ అంతా ప్రజలమీద రుద్దడానికి పనికొస్తోంది కానీ ఒక్క పరిశ్రమను తేవడానికీ పనికిరాకుండా పోతోందని మదన పడిపోయారు. ప్రతినెలా ఒక ఈవెంట్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షించాలనుకున్నా ప్రయోజనం ఉండటం లేదని తెగ బాధపడిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్ చేయడం కోసం ఓ ఈవెంట్ మేనేజర్ ను కూడా నియమించినట్టు శెలవిచ్చారు. పనిలో పనిగా హెలీ టూరిజంకు పచ్చజెండా ఊపారు. కిందనించి ఎవరూ వచ్చి చూడటం లేదు. కనీసం హెలికాఫ్టర్ లో వచ్చైనా చూస్తారేమో చూద్దాం అని ఆశాభావం వ్యక్తం చేసారు. టూరిజం ఉన్నా లేకపోయినా ఏదో పేరుతో ఈవెంట్ చేస్తున్నది ఎందుకు...పరిశ్రమలు వస్తాయనే కదా..సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడ్తాయనే కదా..అలా జరగడం లేదెందుకు అని ఆలోచనలో పడ్డారు. 
రాష్ట్రంలో సువిశాల సముద్రతీరం ఉంది అన్నారు వైజాగ్ బీచ్ వంక చూస్తూ. ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అన్నారు అన్నిటినీ గుర్తు చేసుకుంటూ. కానీ ఎవ్వరూ పెట్టుబడులకు ముందుకు రావడం లేదు...అంతా చెన్నై, గోవా, కేరళా చెక్కేస్తున్నారు అన్నారు దిగులుగా ముఖం పెట్టి. ఎంత ప్రోత్సహిస్తున్నా అనుకున్న స్థాయిలో టూరిజం అభివృద్ధి  చెందడం లేదని దిగులు పడ్డారు. 
అదిచూసి తెగ బాధపడిపోయిన తెలుగు తమ్ముళ్లు బాధ పడకండి ఇకపై వారానికో ఈవెంట్ చేద్దాం. ఒక్కరిని కాదు జిల్లాకొకళ్లుగా ఈవెంట్ మేనేజర్లను నియమిద్దాం. రాష్ట్రానికి టూరిస్టులు ఎందుకు రారో చూద్దాం అన్నారు ఆవేశంగా..
వారి అభిమానానికి చంద్రబాబుకు కన్నీళ్లొచ్చాయి. గబగబా తుడుచుకుని విసవసా నడిచి ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు తమ్ముళ్లకు ఓ గొప్ప అవకాశం ఇస్తున్నాను. మన రాష్ట్రంలో చేయడానికి రకరకాల ఈవెంట్ల ఐడియాలను ఇవ్వండి. మొన్న విశాఖలో చేద్దామనుకున్న బికినీ ఫెస్ట్  అని నాలుక కర్చుకుని అదే అదే బీచ్ ఫెస్టివల్ అర్థంతరంగా ఆగిపోయింది కదా అలా కాకుండా చూడండి అని కూడా సూచనలిచ్చాడు. 
ఎల్లో బ్యాచ్ అంటా బుర్రకు పదును పెట్టడం మొదలెట్టారు. ఏ ఈవెంట్ లో మనకు కంటెంట్ కలిసొస్తుందని సీరియస్ గా ఆలోచించడం మొదలెట్టారు. 
మూడురోజులు తిరిగేసరికి 300 ఈవెంట్ ఐడియాలను తెచ్చి చంద్రబాబు ముందు కుప్పపోసారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి...
నదీ తీరాల్లో వీకెండ్ పేకాట మేళా  ప్రతి శని ఆదివారాల్లో ఈ మేళాలో వచ్చి టికెట్ కొని పేకాడుకోవచ్చు.
ప్రాజెక్టు  నైటు హాల్టు  చంద్రబాబు ప్రాజెక్టులు పక్కన నిద్రపోవడాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పూర్తికాని ఒక్కో ప్రాజెక్టు వద్దా నైట్ హాల్టు చేసేలా హట్స్ ఏర్పాటు చేస్తారు. టికెట్ కొని అక్కడకు వచ్చి ఆ గట్టుమీద హట్టులో నిద్రపోవచ్చు. 
పోలవారం రోజు పూజ  ప్రతిసోమవారం పోలవారం కనుక ఆ రోజు పోలవరం చూడ్డానికి టికెట్ పెట్టాలి, పోలవరానికి పూజకు స్పెషల్ టికెట్ పెట్టాలి. దీనివల్ల టూరిజానికే కాదు పోలవరం ఖర్చులకూ కేంద్రంపై ఆధారపడకుండా ఉండొచ్చు. 
బీర్ డే  బీరును హెల్త్ డ్రింకుగా ప్రమోట్ చేస్తూ ప్రతి ఆదివారం బీర్ డే గా ఈవెంట్ చేయొచ్చు. 
ఇలాంటి మహత్తరమైన మరిన్ని ఐడియాలు ఆ కుప్పలో ఉన్నాయి...ఎంజాయ్ ఆంధ్రప్రదేశ్. 
Back to Top