బాబుగారి దండయాత్ర

 ప్రధాని మోదీపై దండయాత్ర
పూర్తైన తర్వాత చంద్రబాబు గారు దోమలపై దండయాత్రను ఆరంభించారు. ఎసిలో దీక్షలు చేసి, సైకిల్ తో ర్యాలీలు
తీసి, మోదీతో షేక్ హ్యాండ్ ఇచ్చి అత్యద్భుతంగా దండయాత్ర సాగించిన బాబుగారు నేడు
అంతకంటే ముఖ్యమైన యుద్ధానికి కంకణం కట్టుకున్నారు. అదే దోమలపై సమరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దోమల రహిత రాష్ట్రంగా మారుస్తానని
ప్రతిజ్ఞ చేసారు. గతంలోనూ ఇదే పనిమీద కాకినాడ వెళ్లి దోమలపై దండయాత్ర చేసొచ్చారు చంద్రబాబు
గారు. కానీ అప్పటి నుండే అక్కడ దోమకాటు, రోగాల పోటు ఎక్కువైందటున్నారు ఆ ప్రాంత ప్రజలు.

డ్రోన్లతో పారిశుద్ధ
పనులు పరిశీలిస్తాం అంటూ చెప్పడంతో మురుగున్న ప్రతిచోటా డ్రోన్ తిరుగుతోందేమో అని తలపైకెత్తి
చూస్తూ వెళ్లిన చాలామంది ఎదురుగా వచ్చే వాహనాలను గుద్దుకుని ఆసుపత్రిలో పడ్డారు. ఇక పారిశుద్ధ్య పర్యవేక్షణకు
డ్రోన్లు రావనికొన్నాళ్లకు తెలుసుకుని ప్రజలు పైకి చూసే అలవాటును
మానుకున్నారు. చంద్రబాబు మళ్లీ ఇప్పుడు డ్రోన్లతో దోమలపై దండయాత్ర అనంగానే ప్రజలు ఉలిక్కి
పడుతున్నారు. అంటే దోమలెక్కడ ఉన్నాయో డ్రోన్ కెమెరాల ద్వారా వెతికి పట్టుకుంటారా? లేక డ్రోన్ల ద్వారా
మందులు చల్లుతారా? లేక దోమలున్న చోటు నుంచి మనుషులను తరలించేందుకు డ్రోన్ల సాయం తీసుకుంటారా? ఇప్పుడు డ్రోన్ దోమల
దండయాత్ర కార్యక్రమానికి కనీసం ఓ వెయ్యి కోట్లు ఖర్చుపెడతారా? అందులో ప్రచారాలకు సగం
నిధులు వినియోగిస్తారా? అని సవాలక్ష ప్రశ్నలేసుకుంటున్నారు సామాన్యులు. ప్రతినెలా నాలుగో శనివారం
దోమలపై దండయాత్ర చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చినా అధికారులెవ్వరూ ఆ పని చేయట్లేదు. పంచాయితీల్లో దోమల నివారణకు
వాడే ఫాగింగ్ యంత్రాలు లేవు. అర్బన్ ఏరియాల్లో ఉన్నవి సగం మూలనపడ్డాయి. ఒక్కో సిటిలో 10లక్షలకు పైగా ఖర్చు
చేసినా దోమలపై దండయాత్ర సక్సెస్ కాలేదు. ఊరికి 4000 నుంచి 8000 వరకూ ఖర్చు చేసినా దోమల దండయాత్రలో చంద్రబాబును విజయం
వరించలేదు. అందుకే ఇప్పుడు నిధులు పెంచి, డ్రోన్లను తెప్పించి సాంకేతిక యుద్ధంతో దోమల్ని జయిద్దామనుకుంటున్నారు
చంద్రబాబు.

దాదాపు రెండేళ్లుగా
చంద్రబాబు దోమలపై దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. మరో మూడేళ్లలో మస్కిటో ఫ్రీ స్టేట్ గా ఎపిని నిలుపుతానని
ప్రమాణం చేసారు. ఇందుకోసమైన ప్రజలు తనకు వచ్చే ఎన్నికల్లో ఓటేసి తీరాలని చంద్రబాబు అడిగినా
అడగొచ్చు.  తస్మాత్ జాగ్రత్త...దోమలతోనా చంద్రబాబుతోనా అని అడగమాకండి...!!!

Back to Top