అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకో..

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బడితే పూజ తప్పదు 

వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత హెచ్చరిక

రాష్ట్రాన్ని నాశనం చేసింది చంద్రబాబు కాదా?

అన్ని వర్గాల ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు. 

కుల,మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు

బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ సామాజిక న్యాయం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు

అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలి

రుషికొండకు, వైయస్‌ భారతమ్మకు సంబంధం ఏంటి?

మహిళలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు

తాడేపల్లి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత హెచ్చరించారు. సీఎం వైయస్‌ జగన్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే మహిళలంతా కలిసి నీకు బడితె పూజ చేస్తారని వ్యాఖ్యానించారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పారదర్శకంగా పాలన చేస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిస్తే టీడీపీ నేతలు ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి సీఎం సతీమణి వైయస్‌ భారతమ్మకు ఆపాదించడం సరైంది కాదని వార్నింగ్‌ ఇచ్చారు. చంద్రబాబు మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, దమ్ముంటే నిజాయితీగా రాజీయాలు చేయాలని, దమ్ముంటే వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాలు విసిరారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సర్వనాశనం చేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే 2019 లో జరిగిన ఎన్నికల్లో మీ నీతిమాలిన చర్యలకు బుద్ధి చెప్పారు. మీ ఐదేళ్ల పాలనలో విసిగిపోయిన ప్రజలు దుర్మార్గమైన పాలనకు చరమ గీతం పాడారు. అయినా చంద్రబాబు తీరులో ఏమాత్రం మార్పు రాలేదు.

2019 ఎన్నికల్లో అన్ని వర్గాలు వైయస్‌ జగన్‌కు అండగా నిలిచి చరిత్రలోనే ఏకంగా 151 సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. అది మరిచిపోయి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. భగవంతుడు మంచి మాట్లాడటానికి నోరు ఇచ్చారు కానీ, సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేందుకు కాదు అన్నది గుర్తు పెట్టుకోవాలి. సభ్య సమాజంలో దుర్మార్గంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ మూడున్నరేళ్ల పాలనలో వైయస్‌ జగన్‌ పాలనలో అవినీతి లేకుండా పేద,బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అక్కచెల్లెమ్మల ప్రభుత్వంగా ఈ రోజు పారదర్శకంగా డీబీటీ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు నేరుగా అకౌంట్లలో జమ చేశారు.

స్వాతంత్య్ర భారతంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా  వెనుకబడిన బీసీలకు ఒక సంఘ సంస్కర్తగా సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు. సామాజిక విప్లవకారుడిగా వైయస్‌ జగన్‌ ఆదుకుంటున్నారు. బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంటే ఓర్వలేక, ఓటమి భయంతో టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు టీడీపీ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం రాజకీయాల్లో చంద్రబాబుకు తగదు.  రాష్ట్ర ప్రజలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ అంటే గౌరవం లేదు.

సైకో అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మితిమీరి, సభ్య సమాజంలో బీసీ నాయకుడిగా చెలమణి అవుతూ, అవగాహన లేకుండా సీఎం వైయస్‌ జగన్‌ను పట్టుకొని పిల్లి, ఎలుక అని మాట్లాడుతావా?. తీరు మార్చుకోకపోతే రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు, బడుగు, బలహీనవర్గాలు అయ్యన్నపాత్రుడికి బడితే పూజ తప్పదు. దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా రాజకీయాలు చేయాలని హితవు పలికారు. చెత్త రాజకీయాలు చేస్తే ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని పోతుల సునీత హెచ్చరించారు. 

అమ్మా..అనిత ఏం మాట్లాడుతున్నావు..మీ చంద్రబాబు మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడు. నిజాయితీగా రాజకీయాలు చేసే దమ్ము,ధైర్యం మీ చంద్రబాబుకు లేదా?. దమ్ముంటే రండి..వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై తలపడండి. ప్రతి దానికి వైయస్‌ భారతమ్మను ఎందుకు తెరపైకి తీసుకువస్తున్నారు. రుషి కొండకు, భారతమ్మకు ఏంటి సంబంధం?. ఈ రోజు వైజాగ్‌ రాజధాని కావాలని అక్కడి ప్రజల ఆకాంక్ష. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోంది. lఅందుకే మహిళా నేతలతో చంద్రబాబు మాట్లాడిస్తున్నారు.

విశాఖకు పరిపాలన రాజధాని వస్తుందంటే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి. సీఎం క్యాంపు ఆఫీస్‌ నిర్మించాలి. ఇవన్నీ ఉంటేనే అక్కడ పరిపాలన జరుగుతుంది. దీనిపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసం. టీడీపీ మహిళా నేత అనిత సభ్యత, సంస్కారం లేకుండా ప్రతి దానికి భారతమ్మను ఆపాదిస్తూ మాట్లాడితే మహిళలందరూ మీకు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పినా సిగ్గులేకుండా, నీతి లేని రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.

2024 ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి. ఇటీవల తాడేపల్లిలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగితే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. వైయస్‌ జగన్‌ అంబేద్కర్, పూలే ఆశయాలతో సంక్షేమ పాలన అందిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి తెలుసు. కానీ నిన్న మీరు మాట్లాడిన తీరు చూస్తే ..ఎవరో ఒక గన్‌ మీ తల వెనుక పెట్టి బెదిరించి మాట్లాడించినట్లుగా ఉంది. ఇంత కాలం బీసీ నాయకులుగా, మంత్రులుగా ఎలా పని చేశారు.

వైయస్‌ జగన్‌ పాలనలో ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధాని కావాలని న్యాయమైన డిమాండు ప్రకారం వైజాగ్‌ రాజధాని కాబోతోంది. చంద్రబాబు నేతృత్వంలో చేపట్టిన దొంగ పాదయాత్ర అని ప్రజలు గమనించారు. అమరావతి శాసన రాజధానిగా ఉండాలని 50 వేల మంది పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. చంద్రబాబు కుట్రలో అమరావతి రైతులు బలి కాకూడదని ఎమ్మెల్సీ పోతుల సూచించారు.
 

తాజా వీడియోలు

Back to Top