అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత

విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆత్మీయ సమావేశం వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి
 

తాడేప‌ల్లి:  అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చార‌ని  వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్ నిజమైన సంస్కరణలను తీసుకొచ్చార‌ని ప్రశంసలు కురిపించారు.  తాడేపల్లిలో నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు.  బీసీలంటే వెనుకబడిన క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌గా సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో చేసి చూపించారన్నార‌ని తెలిపారు.  తాజాగా, 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 బీసీలకే కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్‌ల లెక్కలు తీస్తే పదివేల మంది బీసీ వర్గాల వారే ఉంటారని.. కింది స్థాయి నుంచి నాయకత్వాన్ని ప్రోత్సాహించటమే ఇది.. గతంలో ఎప్పుడూ లేనంతగా బీసీలకు ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తున్నామ‌ని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, పలువురు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Back to Top