జీవితకాల అధ్యక్ష తీర్మానాన్ని వైయస్‌ జగన్‌ తిరస్కరించారు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఐదేళ్లకు ఒకసారి మాత్రమే బాబుకు ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తారు

ఎన్టీఆర్‌పై అభిమానంతోనే జిల్లాకు పేరు పెట్టాం

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో జీవిత కాల అధ్యక్ష తీర్మానాన్ని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిరస్కరించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  సీఎం వైయస్ జగన్‌ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్‌లోకి ఎక్కలేదన్నారు. దీంతో శాశ్వత అధ్యక్షుడు అనేది లేదని సజ్జల స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి అదే విషయాన్ని స్పష్టం చేస్తామని తెలిపారు. ఐదేళ్లకు ఒకసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నిక ఐదేళ్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఐదేళ్ల పాటు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటారని చెప్పారు. ఐదేళ్ల తరువాత ఎన్నిక ఉంటుందన్నారు. 

ఎన్టీఆర్‌కు అవమానం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. వెన్నుపోటు పొడి ఆయనతో పాటు బయటకు వచ్చిన వారే ఎన్టీఆర్‌ను అవమానపరిచారు.  టీడీపీని చంద్రబాబు కబ్జా చేశారు. ఎన్టీఆర్‌ను చరిత్రలోంచి తీసేయాలని చంద్రబాబు చూశారు.  వైయస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ పట్ల అత్యంత అభిమానం, గౌరవం చూపారు. ఎవరూ అడకకుండానే ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు.  హెల్త్‌ యూనివర్సిటీకి వైయస్‌ఆర్‌ పేరు పెట్టడం ఎన్టీఆర్‌ను అవమానించడం కాదని, వైద్య రంగం కాబట్టి..వైయస్‌ఆర్‌ ఆ రంగానికి విశేష కృషి చేశారు కాబట్టే యూనివర్సిటీకి ఆ పేరు పెట్టారు. అలాంటి ఉద్దేశం ఉంటే జిల్లాకు ఎన్టీఆర్‌కు పేరు ఎందుకు పెడతాం. ఇంతటితో టీడీపీ ఆగకపోతే మేం ఎదురుచేయాల్సి ఉంటుంది. టీడీపీని కబ్జా చేసి మళ్లీ వారే మాట్లాడుతున్నారు. ఏబీఎన్‌ రాధాకృష్ణతో చంద్రబాబు ఎలా మాట్లాడారో అందరం చూశాం. ఎన్టీఆర్‌ పేరు చంద్రబాబు ఏదైనా ఒక పథకానికి పేరు పెట్టారా? ఎన్టీఆర్‌ విధానాలను చంద్రబాబు ఏమైనా అనుసరించారా? ఈ రోజు ఎక్కడలేని ప్రేమ చూపడం అన్యాయం. వైయస్‌ఆర్‌ విగ్రహాలను టీడీపీ హయాంలో ఎందుకు తొలగించారు. నోటికి వచ్చినట్లు ఆయన గురించి మాట్లాడారు. వైయస్‌ఆర్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే నాయకులు. భవిష్యత్‌ తరాలు వైయస్‌ఆర్‌ను, ఎన్టీఆర్‌ను గుర్తు పెట్టుకుంటాయి. వైయస్‌ జగన్‌పై ప్రజలకు సంపూర్ణ నమ్మకం ఉంది. అందుకే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముసుగులో గుద్దులాటలు మాకు తెలియదు. ఎన్టీఆర్‌పై మాకు గౌరవం ఉందని వైయస్‌ జగన్‌ గారు ఆచరణలో చూపారు. ఇంకా చూపుతారు కూడా. ఎన్టీఆర్‌ వారసత్వంగా వచ్చిన వారం మేం కాదు. సిగ్గుంటే టీడీపీని కబ్జా చేసిన వారు సమాధానం చెప్పాలి. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ  పేరును చంద్రబాబుకు ఎందుకు మార్చారు.  ఇవాళ విమర్శించే వారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఎవరిని ఎలా గౌరవించాలో వైయస్‌ఆర్‌సీపీకి ఒక స్పష్టత ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.
 

Back to Top