ఎస్సీలు తలెత్తుకొని తిరిగేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

దళితులకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది

దళిత సంక్షేమంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దళితులంతా తల ఎత్తుకొని తిరుగుతున్నారని, దళితులకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు జూపూడి ప్రభాకర్, నందిగం సురేష్‌ (ఎంపీ), కైలే అనిల్‌ కుమార్‌ (ఎమ్మెల్యే), మొండితోక అరుణ్‌కుమార్‌ (ఎమ్మెల్సీ) హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దళితులను తన బంధువులుగా సీఎం వైయస్‌ జగన్‌ చూస్తున్నారని, ఈ మూడున్నరేళ్ల పరిపాలనలో ఎస్సీలంతా తల ఎత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు. దళితుల మధ్య చిచ్చుపెట్టి.. మరోసారి మోసం చేయాలనే దురుద్దేశంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దళిత సంక్షేమంపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు’ అని దళితులను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడాడని గుర్తుచేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో దళితులను ఏ రోజూ పట్టించుకోలేదన్నారు.  

మూడున్నరేళ్ల వైయస్‌ జగన్‌ పాలనలో దళిత కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయని, సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు పాలనలో గ్రామాల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులను చిన్నచూపు చూసేవారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో గ్రామస్థాయిలో ఒక వ్యవస్థ తెచ్చారని, సంక్షేమ పథకాలు పొందుతున్నామని లబ్ధిదారులు ధైర్యంగా చెప్పుకునేలా వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. పార్టీ ఎస్సీ సెల్‌ మీటింగ్‌లో చర్చించిన విధంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నవారికి బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ చెప్పారు. 
 

Back to Top