సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రైట్ రాయల్ గా హైవే మీదే విశాఖ‌ వస్తారు

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ‌: దొడ్డి దారిన వైజాగ్ రావాల్సిన అవసరం మాకు లేదు.. రైట్ రాయల్ గా హైవే మీదే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌స్తార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ రాజ‌ధాని అంశంపై  విపక్షాల విమర్శలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. సీఎం క్యాంపు ఆఫీస్‌కు సంబంధించి నిర్మాణాలు పూర్తయ్యాక సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైజాగ్ వస్తారు.. అది అక్టోబర్ కావొచ్చు.. నవంబర్‌ కావొచ్చు అని పేర్కొన్నారు.
 
రాజధాని వసతుల కమిటీ ఒకసారి పర్యటించిన తర్వాత బిల్డింగ్ లు ఫైనలైజ్ అవుతాయ‌ని చెప్పారు. పచ్చ కామెర్లతో ఉన్న టీడీపీ నేతలకు వైజాగ్‌ అభివృద్ది, ఆకాంక్ష పట్టదని మండిపడ్డారు. విశాఖ ప్రజలు కోరుకోవడం లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్కడ నుంచి వచ్చారు..? అని నిలదీశారు. వియ్యంకుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గంటా.. అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. 

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పై సీఎం వైయ‌స్‌ జగన్‌ వ్యాఖ్యల్లో అనుచితం ఏమీ లేదని.. ఉన్న మాటే ముఖ్యమంత్రి చెప్పారన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు లేని పవన్ కల్యాణ్‌ కోసం మాట్లాడటం వృథా అని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కామెంట్‌ చేశారు.

క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌కు ఘ‌న స‌న్మానం
విశాఖ ఫోర్త్ గెట్ హోటల్లో కేర్ ఫర్ క్రికెట్ ఆధ్వర్యంలో  క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌ను ఘ‌నంగా స‌న్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  వైయ‌స్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వై వి సుబ్బారెడ్డి , మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, ఆహ్వానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కే.ఎస్. భరత్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురంలో జన్మించాడు. ఆయన తండ్రి విశాఖపట్నంలో నావీలో ఉద్యోగం ఉండడంతో ఆయన విద్యాభాస్యంత అక్కడే జరిగింది. భరత్‌ విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజ్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. కే.ఎస్. భరత్‌ 2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టి 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన భరత్‌ 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. కోన శ్రీకర్‌ భరత్‌ 2023 ఫిబ్రవరి 09న మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో తొలిసారిగా భారత్ తరపున తన తొలి మ్యాచ్ ను ఆడాడు. 

Back to Top