గుంటూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైయస్ విజయమ్మ లక్షలాది నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సభా వేదికపైకి చేరుకున్నారు. వేదికపై ఉన్న నేతలను పేరుపేరునా పలకరించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్ జగన్, వైయస్ విజయమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండో రోజు ప్లీనరీలో ప్రధానంగా అజెండాకు సంబంధించి సామాజిక సాధికారత, పరిశ్రమలు, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా దుష్టచతుష్టం మీద తీర్మానాలను వైయస్‌ఆర్ సీపీ ఆమోదించనుంది.