ప్రత్యేక గైడ్ లైన్స్‌పై  వైయ‌స్ఆర్‌సీపీ అభ్యంతరం

ఈసీకి ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

 అమ‌రావ‌తి:  పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై సీఈవో ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్ పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారుల‌ను మంత్రి మేరుగు నాగార్జున‌, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మ‌ద్దాల గిరి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, గ్రివెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు నారాయ‌ణ‌మూర్తి క‌లిసి ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై సీఈవో ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామ‌న్నారు.  ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు ఇచ్చార‌ని నిల‌దీశారు. ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్ లైన్స్ ఎలా ఇస్తారన్నారు. ఎక్కడా లేని సర్క్యులర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అన్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయ‌న కోరారు. 

Back to Top