భోగాలు మీవి.. త్యాగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలవా బాబూ..?

తాడేపల్లి: రాజ్యసభ ఎన్నికల్లో గెలవలేరని తెలిసి కూడా బరిలో బడుగులను దింపి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందుతున్నారని ట్విటర్‌ వేదికగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘భోగాలు మీవి త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలవా? రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేక  ఓటమిచెందే సమయంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారు. ఈనెల19న మీ బలం ఎంతో, వెంట ఉండేది ఎవరో, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుంది’ అని ట్వీట్‌ చేశారు.  
 

Back to Top