2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా!

టీడీపీపై  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు..

అమరావతి: టీడీపీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించారు  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘‘మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా!. రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట. వాళ్ళ ఆనందమే వేరులే. మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్‌గా చెప్పడం ఎదైతో ఉందో.. నభూతో నభవిష్యత్’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

Back to Top