రైతుల పంటలు తగులబెట్టించిన దుర్మార్గుడు చంద్రబాబు

రాజధాని వికేంద్రీకరణ జరగాలి.. అన్ని ప్రాంతాలు బాగుండాలి

ప్రధానిని చూసేందుకు లైన్‌లో నిల్చున్న నన్ను ఎంపీని చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

వైయస్‌ఆర్‌ సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌

గుంటూరు: రాజధాని పేరుతో రైతుల పంటలను తగులబెట్టించిన దుర్మార్గుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు. కారుచౌకకు రైతుల నుంచి భూములు లాక్కొని పేద రైతులను రోడ్డునపడేసిన నీచుడు అని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రాజధాని నూజివీడు అని ప్రకటించి తన బినామీలతో అమరావతి ప్రాంతంలో వందల ఎకరాల భూములను చౌకధరలకు కొనుగోలు చేయించిన తరువాత అమరావతిని ప్రకటించాడని, అసైన్డ్‌ భూములను కూడా బెదిరించి, భయపెట్టి పేద రైతుల నుంచి లాక్కున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో ఎంపీ నందిగం సురేష్‌ పాల్గొని మాట్లాడారు. 

‘సంవత్సరానికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేం, సారవంతమైన భూములు కావాలని రైతులంతా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు కుయుక్త రాజకీయాలు, కుట్రలు పన్ని రైతులపై కేసులు పెట్టాలనే వ్యూహంతో భూములు తగలబెట్టించాడు. హాయిల్యాండ్‌ ప్రాంతంలో తన మినిస్టర్లతో రైతుల పంటలను తగలబెట్టించి భయబ్రాంతులకు గురిచేశాడు. అక్కడి నుంచి మొదలైన రాజధాని రణరంగం.. ఇష్టానుసారంగా పరిపాలించాడు. వ్యతిరేకించిన వారందరిపై కేసులు పెట్టించాడు. 

సింగపూర్‌ టెక్నాలజీతో అమరావతిలో మూడు సంవత్సరాల్లో రాజధాని కడతాను అని ప్రగల్భాలు పలికాడు. మూడేళ్లలో వర్షానికి కారిపోయే తాత్కాలిక అసెంబ్లీ, ఎల్‌సీడీలు పెట్టి గ్రాఫిక్స్‌ చూపించాడు. రాజధాని శంకుస్థాపనకు పీఎం మోడీని పిలిచి.. అంతా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను పిలుచుకొని వారికి పట్టువస్త్రాలు పెట్టాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపాలా పెట్టాడు.

దేశ ప్రధానిని లైవ్‌లో చూడాలనుకున్న నన్ను తీసుకెళ్లి.. ఏకంగా దేశ ప్రధానిని కూర్చోబెట్టి ఎంపీని చేసింది సీఎం వైయస్‌ జగన్‌. రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అన్ని ప్రాంతాలు బాగుపడాలి.. బాగుండాలి అనేది సీఎం వైయస్‌ జగన్‌ నినాదం. హైదరాబాద్‌ను కోల్పోయిన బాధ మరోసారి ఎదురవ్వకూడదు. అన్ని ప్రాంతాలు బాగుపడాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.’
 

Back to Top