చిత్తూరు: 2019కి ముందే టీడీపీ బోగస్ ఓట్లు నమోదు చేసిందని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. టీడీపీ బోగస్ ఓట్లనే దొంగ ఓట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ వ్యవహారం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. ఓట్లు తొలగించి దొంగ ఓట్లు సిద్ధం చేసిన ఘనత టీడీపీదే అన్నారు. దొంగ ఓట్లు తొలగించాలని మేమే ఈసీని కోరుతున్నామన్నారు. హెరిటేజ్ కోసం విజయ డెయిరీని చంద్రబాబు మూసేశారని మిథున్‌రెడ్డి విమర్శించారు. జులై 4న విజయ డెయిరీ పనులను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. పాడి రైతులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు.