విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి

లోక్‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి
 

న్యూఢిల్లీ: విమానాశ్రయాలలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రతిపాదించిందా అలాగే విమానాశ్రయాలలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏదైనా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తుందా అలా అయితే, దాని వివరాలు..కాకపోతే దానికి గల కారణాలు తెల‌పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రాల వారీగా నిధులు మంజూరు మరియు విడుదల చేశారా వివరాలు తెలుపగలరు అంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి గురువారం పార్లమెంట్ లో ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర విమానయాన శాఖా సహాయ మంత్రి డా.వి.కె.సింగ్ సమాధానం ఇస్తూ .. 
విమానాశ్రయాల అభివృద్ధి, ఆధునీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని, భూమి లభ్యత, వాణిజ్య సాధ్యత, సామాజిక-ఆర్థిక పరిగణనలు, ట్రాఫిక్ డిమాండ్ ఆధారంగా ఎప్పటికప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మరియు ఇతర ఎయిర్‌పోర్ట్ డెవలపర్‌లచే చేపట్టబడుతుందన్నారు. 

రాబోయే ఐదేళ్లలో ప్రస్తుత టెర్మినల్స్, కొత్త టెర్మినల్స్ మరియు రన్‌వేలను బలోపేతం చేయడం మరియు ఇతర కార్యకలాపాలను విస్తరించడం విమానాశ్రయ రంగంలో సుమారు రూ.98, 000 కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని తెలియజేసారు. 

తొమ్మిది (09) గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ప్రాజెక్ట్ ఖర్చులు ఈవిధంగా ఉన్నాయని తెలియజేస్తూ దుర్గాపూర్-రూ.670 కోట్లు, షిర్డీ-రూ.320 కోట్లు, పాక్యోంగ్-రూ. 553.53 కోట్లు, కన్నూర్ రూ.2342 కోట్లు, కలబురగి- రూ.175.57 కోట్లు, ఓర్వకల్ (కర్నూలు)- రూ.187 కోట్లు, సింధుదుర్గ్- రూ.520 కోట్లు, ఖుషీనగర్-రూ.448 కోట్లు, దోనీ పోలో, ఇటానగర్ రూ.646 కోట్లు. గా తెలియజేసారు అలాగే అంతేకాకుండా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, మంగళూరు, గౌహతి మరియు అహ్మదాబాద్ విమానాశ్రయాలు రూ.10,550 కోట్లు, రూ.13,552 కోట్లు, రూ. 2019-25 కాలానికి వరుసగా రూ.6,288 కోట్లు, రూ.1,383 కోట్లు, రూ.567 కోట్లు, రూ.1,232 కోట్లు, రూ.376 కోట్లు కేటాయించింది అని తెలిపారు. మరో ప్రశ్నకి సమాధానంగా విజయవాడ విమానాశ్రయంలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ భవనం నిర్మాణం,ఏటిసి టవర్ మొదలగు నిర్మాణాలకు 611.80 కోట్ల రూపాయలకి ఆమోదం తెలుపబడిందని తెలియజేశారు.

Back to Top