పసుపు–కుంకుమ పేరుతో రాజకీయాలు

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక

సంక్షోభంలో వ్యవసాయం, చేనేత రంగాలు

చంద్రబాబు మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారు 

గుంటూరు: చంద్రబాబు పవిత్రమైన పసుపు–కుంకుమ పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక విమర్శించారు. చేనేతలకు రాజకీయంగా అవకాశం కల్పించకుండా దగా చేశారని మండిపడ్డారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎనికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమరంలో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు మంచికి, చెడుకు తేడా తెలుసుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న మాట మీద నిలబడే వ్యక్తి అయితే..చంద్రబాబు భ్రమ, మాయమాటలు చెప్పి మోసం చేసే వ్యక్తి అని దగ్గర నుంచి చూశానని చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజలను కూడా మభ్యపెడుతూ..మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో ఎలాంటి మోసపు హామీలు ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటి హామీలే ఇస్తున్నారు. వ్యవసాయం, చేనేత రంగాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

వ్యవసాయ రైతుకు తినేందుకు తిండి కరువైందని, చేనేతలకు కట్టుకునేందుకు గుడ్డ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాఫిక్స్‌తో చంద్రబాబు మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈసారి మోసపోవద్దని సూచించారు. పసుపు–కుంకుమ పేరుతో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి పది వేలు ఇచ్చి మోసం చేశారన్నారు. జగనన్న పాలన వస్తే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. చేనేతలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో టీడీపీ నుంచి టికెట్టు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. గంజీ ఆంజనేయులు ఐదేళ్లు కష్టపడితే ఆయనకు టికెట్టు ఇవ్వకుండా దగా చేశారన్నారు. ఇంతవరకు బీసీలకు ఏం చేశారని నిలదీశారు. చేనేతలకు కార్పొరేషన్‌ కావాలని కోరుతుంటే..ఎన్నికల ముందు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారన్నారు. జగనన్న సీఎం అయితే ప్రతి చేనేత కుటుంబానికి రూ.2 వేలు ఇస్తారని చెప్పారు. ప్రతి పిల్లవాడిని స్కూల్‌కు పంపిస్తే రూ.15 వేలు ఇస్తారన్నారు. మాటమీద ఉండే వ్యక్తి వైయస్‌ జగన్‌ అని..ఒక్కసారి అవకాశం ఇస్తే సువర్ణ పాలన తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top