కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆన్‌లైన్‌లోనూ ప్రచారం హోరెత్తుతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వేదికగా అభ్యర్థులు తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులతోపాటు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఆన్‌లైన్ ప్రచారాల్లో వైయస్ఆర్‌సీపీ తరఫున బరిలో ఉన్న వెన్నపూస రవీంద్రారెడ్డి, ఎంఎస్ రామచంద్రారెడ్డి దూసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూపించి తమకు ఓటు వేయాలని వారు కోరుతున్నారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలనను చూపించి ఆన్‌లైన్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలకు ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లను వేదికలుగా చేసుకుని ప్రచారం కొనసాగిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్‌లలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారాల కనిపిస్తున్నాయి. ఫేస్‌బుక్ గ్రూపుల్లోనూ ఓటు అభ్యర్థనలు ఉంటున్నాయి. కొందరు ఆడియో, వీడియోలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆయా ఫొటోలు, ఆడియో, వీడియోలు లైక్‌లు, షేర్లతో అన్ని గ్రూపుల్లో ప్రచారాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. పోటీలో ప్రధానంగా ఉన్న అభ్యర్థులందరూ నేరుగా ఓటర్లకు తమ సందేశాన్ని పంపేందుకు చూస్తున్నారు. ఇందుకోసం ఐవీఆర్‌ఎస్ (ఇంట్రాయాక్టివ్ వాయిస్ రెస్పాన్ సిస్టం)ను ప్రధానంగా ఎంచుకున్నారు. నేరుగా వారే ఫోన్ ద్వారా ఓటర్లను పలకరిస్తున్నారు. తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అంతేగాక పోలింగ్ తేదీ, ఓటు ఎక్కడ ఉందో కూడా తెలుపుతున్నారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల తరఫున పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను కలుసుకొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.
కోడుమూరులో..
కోడుమూరు నియోజకవర్గంలో వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రా రెడ్డి కిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి గెలిపించాలని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ అభ్యర్థించారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల, గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, గ్రామంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించారు.

శ్రీశైలం నియోజకవర్గంలో..
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, శ్రీశైలం మండలాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి ఇంటికి పార్టీ శ్రేణులు వెళ్లి ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. మంగళవారం మహానంది మండలం నందిపల్లె గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.