అసెంబ్లీ: అన్ని వర్గాలను సమప్రాధాన్యం.. సమన్యాయం చేస్తూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీఎం వైయస్ జగన్ అభినవ అంబేడ్కర్‌గా నిలిచారని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రతి నామినెటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైయస్ జగన్‌దన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్‌లో 12 మంది డైరెక్టర్లను నియమించి వారిని రాజకీయంగా తోడ్పాటును అందిస్తున్నారన్నారు. ప్రపంచానికి నాగరికత నేర్పించిన రజకులు, నాయీ బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, వారికి ఆర్థికసాయం రూ.10 వేలు అందిస్తూ ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా ప్రతి కుల వృత్తులను ప్రోత్సహిస్తూ.. వారిని ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు అందించారన్నారు.
బీసీల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఆశయాలను భుజానికి ఎత్తుకొని మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. గర్భిణులు, బాలింతల కోసం వైయస్‌ఆర్ పోషణ, వైయస్‌ఆర్ పోషణ ప్లస్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. పిల్లలకు అమ్మఒడి, నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం అందిస్తున్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని సీఎం తపిస్తున్నారు. వైయస్‌ఆర్ చేయూత ద్వారా మహిళలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనేది సీఎం లక్ష్యమన్నారు. నమ్మించేవాడు నాయకుడు కాదు.. నడిపించేవాడు నాయకుడు అనే విధంగా పనిచేస్తూ జగనన్న భరోసా, ఆసరా, తోడు ద్వారా న్యాయం చేస్తున్నారని వివరించారు.