151 సీట్లుతో వైయస్‌ఆర్‌సీపీ చరిత్ర తిరగరాసింది

అబద్ధాల చంద్రబాబును ప్రజలు నమ్మలేదు

రాజధాని రైతులను నిలువునా మోసం చేశారు

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుభిక్ష పాలన అందిస్తారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

 

అమరావతి: 151 సీట్లు సాధించి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర తిరగరాశారని  . తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అమరావతి పేరుతో ఐదేళ్ల పాటు చంద్రబాబు అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజలు నమ్మలేదని..సరైన గుణపాఠం చెప్పారని తెలిపారు. రాజధాని పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు పాలనలో  అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.టీడీపీ పాలనలో ఉద్యోగాలు రాలేదని, ఫీజురీయింబర్స్‌ లేక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు.పేదలకు పక్కా ఇళ్లు కూడా ఇవ్వలేదని తెలిపారు.వృద్ధులకు కనీసం పింఛన్లు కూడా సరిగ్గా అందించలేదని మండిపడ్డారు.ప్రజలందరూ మార్పు కోరుకున్నారని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలందరూ భావించారన్నారు. అందువలనే వార్‌ వన్‌సైడ్‌ అయ్యిందని తెలిపారు.

 

Back to Top