ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే..

మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌

నర్సీపట్నం: ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రజలంతా నిలబడ్డారని, అందుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు 101 స్థానాలకు గానూ 73 మంది వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజలంతా మద్దతుగా నిలిచారన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ట్యాక్స్‌లు అదనంగా వసూలు చేసేవారని, వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ట్యాక్స్‌లు తగ్గించామని చెప్పారు. 
 

Back to Top