రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ, శని చంద్రబాబు

ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం

2019 ఓటమితోనైనా బాబు సిగ్గువస్తుందని ఆశపడ్డాం.. కానీ తీరు మారలేదు

ఐటీ దాడుల నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికి విషప్రచారం

వైయస్‌ఆర్‌ కుటుంబం బతుకునిచ్చే కుటుంబం

బాబు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైయస్‌ జగన్‌ ఈగ కూడా వాలనివ్వం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ, శని, చంద్రబాబు. 2019 ఎన్నికల ఓటమితోనైనా చంద్రబాబుకు సిగ్గువస్తుందని ఆశపడ్డాం కానీ, రాష్ట్రానికి ప్రధాన శత్రువుగా పట్టిపీడిస్తున్నాడు. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ని, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఎల్లోమీడియాని చేతుల్లో పెట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నాడు. పరిశ్రమలు వెళ్లిపోవాలని పిలుపునిచ్చే చంద్రబాబే ఈ రాష్ట్రం విడిచివెళ్లిపోవాలని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు కోరారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే అసహ్యమేస్తుందన్నారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలను బహిర్గతం చేయనని చెప్పిన చంద్రబాబు అమరావతిలో తన కోటరీతో భూములు కొనుగోలు చేయించి రాజద్రోహానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిపై ఐటీ దాడులు జరుగుతుంటే.. ఆ విషయం నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికి కియా కంపెనీ వెళ్లిపోతుందంటూ ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని పచ్చి అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైయస్‌ జగన్‌పై ఈగ కూడా వాలనివ్వకుండా కాపాడుకుంటామన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, లోకేష్‌ ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై విషాన్ని కక్కుతున్నారో ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న దొంగల ముఠాకు ఆపద వచ్చిందని గ్రహించాడు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. రాజధాని ప్రకటనకు ముందే తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు తన బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాం. అయినా పట్టించుకోలేదు. 

ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావాలనే ఆకాంక్షతో సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాకు ఏ పాపం తెలియదు. సెంటు భూమి కూడా కొనలేదని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ చేయించి శిక్షించాలని అసెంబ్లీలో కోరాడు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పైన సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం బిల్లు పాస్‌ చేసింది.. ఈ రోజున ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భూములు కొనుగోలు చేసిన వారి వివరాలు తీస్తే ప్రత్తిపాటి పుల్లారావు కారు డ్రైవర్, పత్తి మిల్లులో పనిచేసే వర్కర్, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు.. ఇలాంటి వారి బాగోతాలు బయటకు వస్తుంటే చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితుల్లో సముద్రంలోంచి ఒడ్డునపడిన చాపలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. 

చంద్రబాబుకు లెఫ్ట్, రైట్‌గా ఉన్న సుజనా చౌదరిపై గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. సుజనా చౌదరి బీజేపీలోకి చేరడం వెనుక ఉన్న కారణం ప్రజలకు తెలియదనుకోవడం చంద్రబాబు తెలివితక్కువతనంగా భావిస్తున్నాం. సుజనా చౌదరిని, సీఎం రమేష్‌ లాంటి వారిని బీజేపీలోకి పంపించినా.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బహిర్గతం అవుతున్నాయని బాబుకు భయం పట్టుకుంది. అందుకే ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ని, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని ఎల్లోమీడియా ద్వారా చేసే దుష్ప్రచారం చేయిస్తున్నాడు. ఓటమితోనైనా చంద్రబాబుకు సిగ్గు వస్తుందని ఆశపడ్డాం. ఇప్పటికీ మారలేదు. ప్రతీది రాజకీయ వ్యభిచార మాటలే. బాబు పోకడలు రాజకీయాలకు పరాకాష్టగా వైయస్‌ఆర్‌ సీపీ అభివర్ణిస్తుంది. ఎల్లో మీడియా ద్వారా విషప్రచారం చేయిస్తున్నాడు. ఇసుక దొరకడం లేదని ఎంతో మంది కార్మికులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పాడు. ఎక్కడ శవం దొరికితే అక్కడకు వెళ్లి సీఎంపై బురదజల్లేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. 

వైయస్‌ఆర్‌ కుటుంబం బతుకునిస్తుంది. ప్రాణం ఇస్తుంది.. ప్రాణం పోస్తుంది.. ఉండటానికి ఇల్లు ఇస్తుంది. కానీ, చంద్రబాబులా ఇల్లు కూల్చదు.. పేదల నోటికాడి అన్నం లాక్కోదు. సిద్ధాంతం లేని రాజకీయ వైఖరి చంద్రబాబుది.. కోట్లాది రూపాయలు సంపాదించావు.. తనది కాని పార్టీని సొంతం చేసుకొని నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఆ కుటుంబంలో ఒక్కరినీ రాజకీయాల్లోకి రాకుండా అణగదొక్కుతూ.. చేతగాని తన కొడుకు లోకేష్‌ను టీడీపీ వారసుడిని చేయాలనుకుంటున్నావు. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయాడు. రాజధాని ప్రాంతం కూడా నిన్ను తిరస్కరించింది చంద్రబాబూ. నీ కుట్రలు ఇక సాగనివ్వం. 

కియా మోటార్స్‌ ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయని రెండ్రోజులుగా విస్తృతంగా దుష్ప్రచారం చేయిస్తున్నాడు. బాబు బినామీలపై ఐటీ దాడులు జరుగుతుంటే.. దాంట్లో ఎక్కడ బాగోతం బయటపడుతుందోనని విషప్రచారం చేయించాడు. పరిశ్రమలను వెళ్లిపోవాలని చంద్రబాబే పిలుపు ఇస్తున్నాడు. 40 ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నావ్‌.. ఇకనైనా రాష్ట్రాన్ని వదిలివెళ్లిపోవాలని కోరుతున్నాం.. ఇక్కడి నుంచి పారిపో.. ఇల్లు కట్టుకున్న హైదరాబాద్‌కు వెళ్లిపో.. చంద్రబాబూ.. మీ వైఖరి చూస్తుంటే అసహ్యమేస్తుంది.

ఎస్సీలు బాగుపడితే ఇష్టం లేని చంద్రబాబు దుష్ట పన్నాగాలు పన్నుతున్నాడు. మాకు ఇల్లు ఇస్తున్నాయని, మా బిడ్డలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుంటున్నారని, మా బడులు బాగుపడుతున్నాయని, మధ్యాహ్నం భోజన పథకంలో పౌష్టికాహారం అందిస్తున్నారని, ప్రాథమిక విద్య కాదు.. ప్రాథమిక ఆరోగ్యం పట్టించుకున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు వైయస్‌ జగన్‌. ఈ రోజు రాష్ట్రంలో అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అది చూసి ఓర్వలేకనే టీడీపీ కుట్రలు చేస్తుంది. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైయస్‌ జగన్‌పై ఈగ కూడా వాలనివ్వం. 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉగాదికి పంపిణీ చేయనున్నారు. మేనేజ్‌మెంట్‌ మీద, ఎమ్మెల్యేలను కొనడం, డబ్బుల సంచులు దొరికితే ఆ రాష్ట్రాన్ని వదిలి అమరావతి రావడం నీ చరిత్ర. దాన్ని పెద్ద హీరోటిక్‌గా మాట్లాడుతున్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. పదే పదే అబద్ధాలను ప్రచారం చేసి ప్రచార పిచ్చితో చచ్చిపోతున్నావు. ఇప్పటికైనా మారు చంద్రబాబు.. 
 

తాజా వీడియోలు

Back to Top